ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 30,984,414 దాటింది. కరోనాకు 961,400 మంది బలయ్యారు. 22,583,400 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7,439,614 మంది చికిత్స పొందుతున్నారు.
వివిధ దేశాల్లో కరోనా కేసులు ఇలా..
- అమెరికాలో కరోనా కేసులు 70 లక్షలకు చేరువయ్యాయి. 24 గంటల్లో ఇక్కడ కొత్తగా 42,533 కేసులు, 657 మరణాలు నమోదయ్యాయి.
- బ్రెజిల్లో కరోనా విజృంభణ తగ్గడం లేదు. ఇక్కడ మొత్తం కేసులు 45 లక్షల మార్క్ దాటాయి. కొత్తగా 30,313 కేసులు, 708 మరణాలు నమోదయ్యాయి.
- రష్యాలో కరోనా కేసులు 11 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 6 వేల 65 కేసులు నమోదయ్యాయి.
- పెరూలో కొత్తగా 7,927 కేసులు, 86 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 762,865కు చేరాయి.
- కొలంబియాలో కరోనా మరణాలు 24 వేలు దాటాయి. శనివారం కొత్తగా 189 మంది కరోనాతో మృతి చెందగా.. 7,927 కేసులు నమోదయాయ్యాయి. మొత్తం కేసులు 758,398 దాటాయి.