ETV Bharat / international

యూఎన్​జీఏలో కరోనా కలకలం- బ్రెజిల్ మంత్రికి పాజిటివ్​

author img

By

Published : Sep 22, 2021, 5:00 PM IST

Brazil's Health Minister Marcelo Queiroga tested positive for COVID-19 hours
యూఎన్​జీఏలో కరోనా కలకలం- బ్రెజిల్ మంత్రికి పాజిటివ్​

న్యూయార్క్​లో జరుగుతున్న ఐరాస సర్వసభ్య సమావేశంలో(unga session 2021) కరోనా కలకలం రేపింది. ఈ సదస్సుకు హాజరైన బ్రెజిల్ ఆరోగ్యమంత్రి మార్సిలో క్వైరోగాకు పాజిటివ్​గా తేలింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్​ బోల్సోనారోతో కలిసి ఆయన యూన్​జీఏలో పాల్గొన్నారు.

అమెరికాలోని న్యూయార్క్ వేదికగా నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశంలో(unga session 2021) కరోనా కేసు వెలుగు చూసింది. బ్రెజిల్ ఆరోగ్య మంత్రి(brazil health minister) మార్సిలో క్వైరోగాకు వైరస్ సోకినట్లు తేలింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోతో(jair bolsonaro news) పాటు ఈయన సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్​ వెళ్లారు.

అయితే బ్రెజిల్​ ప్రతినిధుల బృందంలోని మిగతా వారందరికీ నెగెటివ్​గా తేలినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం తెలిపింది. ప్రస్తుతం క్వైరోగా క్వారంటైన్​లో ఉన్నారని, 14 రోజులు పాటు న్యూయార్క్​లోనే ఉంటారని పేర్కొంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

కరోనా కారణంగా ఐరాస సర్వసభ్య సమావేశాన్ని(unga summit 2021) గతేడాది వర్చువల్​గా నిర్వహించారు. ఈ సారి మాత్రం ఆయా దేశాల నాయకులు ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. సెప్టెంబర్​ 21 నుంచి 27వరకు ఈ సదస్సు జరగనుంది.

బ్రెజిల్ ఆరోగ్య మంత్రి మార్సిలో.. చైనా అభివృద్ధి చేసిన కరోనావ్యాక్​ టీకాను తీసుకున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఎప్పుడు తీసుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

అమెరికాలో కరోనా కేసులు ఇంకా అధికంగా వెలుగుచూస్తున్నందున ఈసారి కూడా సదస్సును(unga 2021) వర్చువల్​గానే నిర్వహించాలని భావించారు. కానీ పలు దేశాల ప్రతిపాదన మేరకు ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. 100కు పైగా దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో ఈ సమావేశం కరోనాకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోకుండానే సదస్సుకు హాజరవుతున్నారు.

ఇదిలా ఉంటే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా పట్ల మొదటి నుంచి నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. తాను టీకా వేయించుకోనని తేల్చి చెప్పారు. కరోనా బారినపడి కోలుకున్నా కూడా తన వైఖరిలో మార్పు రాలేదు.

ఇదీ చదవండి: కొవిషీల్డ్​ను యూకే ఆమోదించినా.. క్వారంటైన్​లోనే భారత ప్రయాణికులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.