ETV Bharat / international

బెజోస్​ బృందం గర్వపడుతున్న విషయం ఇదే!

author img

By

Published : Jul 20, 2021, 12:04 PM IST

Updated : Jul 20, 2021, 2:28 PM IST

మరికొద్ది గంటల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేయనున్నారు. బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన అంతరిక్షయాత్రలో భాగంగా.. బెజోస్​తో పాటు ఆయన సోదరుడు, మరో ఇద్దరు రోదసికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బెజోస్​ 'స్పేస్​ టూర్'​ విశేషాలు తెలుసుకుందాం.

jeff bezos, space tour
జెఫ్ బెజోస్, స్పేస్ టూర్

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్రకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో బెజోస్​, ఆయన సోదరుడు మార్క్ బెజోస్ సహా మరో ఇద్దరు రోదసిలోకి ప్రయాణించనున్నారు. ఈ నేపథ్యంలో బ్లూ ఆరిజిన్ సంస్థ చేపడుతున్న ఈ అంతరిక్ష యాత్ర విశేషాలను ఓసారి చూసేద్దాం..

blue origin, space tour
బ్లూ ఆరిజిన్
  • పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్​ సైట్​ వన్​ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు) న్యూ షెపర్డ్​ దూసుకెళ్లనుంది. దీనిని గంటన్నర ముందు నుంచే BlueOrigin.comలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
  • ఈ పూర్తి స్వయంచాలిత ఫ్లైట్​లో.. బెజోస్​తో పాటు ప్రముఖ మహిళా పైలట్​ వేలీ ఫంక్​ వెళ్లనున్నారు. ఆమెకు 82 ఏళ్లు. దీనితో ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. వీరితో పాటు ప్రయాణించనున్న 18ఏళ్ల ఆలివర్‌ డేమన్‌.. అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు.
  • ఈ రోదసి వీరుల బృందం.. భూవాతావరణానికి, రోదసికి సరిహద్దు అయిన కర్మాన్​ రేఖ ఆవల, భూమి నుంచి 100కిలోమీటర్ల ఎత్తులో 11 నిమిషాలు గడుపనున్నారు.
    space tour, bezos
    లాంచింగ్ స్టేషన్
  • ఈ వ్యోమనౌక 65 మైళ్ల (106కి.మీలు) ఎత్తువరకు వెళ్లగలదు.
  • రోదసికి చేరుకున్నాక అక్కడి నుంచి భూమిని, విశ్వాన్ని క్యాబిన్​ నుంచి వీక్షించనుంది బెజోస్ బృందం. ఆ తర్వాత క్యాప్సుల్ తిరిగి భూమికి చేరుకుంటుంది. పెద్ద ప్యారచూట్ల సాయంతో యాత్రికులు కిందకి దిగుతారు.
  • బెజోస్​ బృందం ప్రయాణిస్తున్న క్యాప్సుల్​కు పెద్ద విండోలు ఉండటం విశేషం. ఇంత భారీ విండోలతో అంతరిక్షాన్ని చూసే అవకాశం దక్కినందుకు గర్వపడుతున్నామని బెజోస్​ బృందం వెల్లడించింది. ఇటీవలే రోదసి యాత్ర పూర్తి చేసిన బ్రిటన్​ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందం వెళ్లిన క్యాప్సుల్​కు ఎరోప్లేన్ సైజ్​ విండోలు మాత్రమే ఉన్నాయి.
  • న్యూషెపర్డ్​ వ్యోమనౌకకు ఎస్కేప్​ సిస్టమ్​ ఉంది. ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే యాత్రికులు ఉన్న క్యాప్సుల్, వ్యోమనౌక నుంచి విడిపోతుంది.
  • 2012 నుంచి న్యూషెపర్డ్​ వ్యోమనౌకను 15 సార్లు విజయవంతంగా ప్రయోగించింది బ్లూ ఆరిజన్. అయితే.. మానవసహిత ప్రయోగం మాత్రం ఇదే తొలిసారి.
  • 'న్యూ షెపర్డ్‌' అభివృద్ధిలో మరాఠా అమ్మాయి సంజల్‌ గవాండే కీలక పాత్ర పోషించడం విశేషం.
    space tour, bezos
    అంతరిక్షయాత్రకు సిద్ధమైన బెజోస్

ఇప్పుడిప్పుడే ప్రైవేటు అంతరిక్ష యాత్రలకు ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో.. 'స్పేస్ టూరిజం' రంగానికి ఈ నెలలోనే ఇది రెండో పెద్ద ఘట్టం! బిలియనీర్ల మధ్య రోదసియానానికి తీవ్ర పోటీ నెలకొన్న వేళ ఇటీవలే దానిని విజయవంతంగా పూర్తి చేశారు వర్జిన్​ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్.

ఇదీ చదవండి:

Space tour: 'బెజోస్​తో అంతరిక్ష యాత్ర ఊహించలేదు'

బెజోస్‌ వ్యోమనౌక వెనుక.. భారత యువతి

Last Updated : Jul 20, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.