ETV Bharat / international

ట్రిలియన్ డాలర్ల బిల్లుపై బైడెన్ సంతకం

author img

By

Published : Nov 16, 2021, 9:30 AM IST

Biden signs $1T infrastructure bill with bipartisan audience
ట్రిలియన్ డాలర్ బిల్లుపై బెడెన్ సంతకం

అమెరికాలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ట్రిలియన్ డాలర్ల బ్లిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చనుంది. ఉభయపక్షాలు తలచకుంటే ఏం సాధించవచ్చో ఈ బిల్లు రుజువు చేసిందని బైడెన్ అన్నారు. ఈ చట్టంతో అమెరికన్ల జీవన విధానమే మారిపోతుందని ఆకాంక్షించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ట్రిలియన్ డాలర్ల ఇన్​ఫ్రాస్ట్రక్చర్ బిల్లుపై సోమవారం సంతకం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల అమెరికన్ల జీవిన విధానంలో సమూల మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. ఉభయపక్షాలు సహకరిస్తే ఏం సాధించవచ్చో చెప్పేందుకు ఈ బిల్లే నిదర్శమమని పేర్కొన్నారు.

ద్రవ్యోల్భణం పెరగడం, నిరుద్యోగాలు, కరోనా మహమ్మారి, ఆర్థిక ముప్పు వంటి కారణాలతో బైడెన్ ప్రజాదరణ తగ్గుతోంది. అయితే ట్రిలియన్​ డాలర్ల బిల్లుతో ఆయన పాపులారిటీ మళ్లీ పెరుగుంతందని భావిస్తున్నారు. 'అమెరికా మరోసారి మార్పు దిశగా పయనిస్తోంది. మీ జీవితాలు మరింత మెరుగుపడతాయి' అని బిల్లుపై సంతకం చేసిన తర్వాత బైడెన్ సందేశమిచ్చారు.

ఈ చట్టంతో అమెరికాలో ఉద్యోగాలు, స్వచ్ఛమైన నీరు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయులు మెరుగుపడతాయని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. రోడ్లు, వంతెనలు, భవిష్యత్తులో స్వచ్ఛ ఇంధనం, బ్రాడ్​బ్యాండ్, నీటి వ్యవస్థ, నౌకాశ్రయాలు వంటి వాటిలో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుంతుందని భావిస్తోంది.

ఈ బిల్లుకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలిపారు. 2022 మధ్యంతర ఎన్నికలకు ముందు ఉభయపక్షాలు ఐకమత్యం ప్రదర్శించిన చివరి ఘట్టం కూడా ఇదే కానుందని ఆ పార్టీ చట్టసభ్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కష్టాల్లో ట్రంప్.. గట్టెక్కేందుకు​ హోటళ్ల అమ్మకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.