ETV Bharat / international

'మతి' పోగొడుతున్న కాలుష్యం!

author img

By

Published : Aug 6, 2021, 7:36 AM IST

చిన్న పాటి రేణువులుతో కూడిన కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలోని వారికి తీవ్ర మతిమరుపు వ్యాధి (డిమెన్షియా) ముప్పు అధికమని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పీఎం 2.5 రేణువులు డిమెన్షియా ముప్పును పెంచుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

Dementia
మతిమరుపు

వాతావరణంలో చాలా చిన్న పాటి రేణువులు(పీఎం 2.5)తో కూడిన కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలోని వారికి తీవ్ర మతిమరుపు వ్యాధి (డిమెన్షియా) ముప్పు అధికమని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వాతావారణంలో 2.5 మైక్రోమీటర్లు, అంతకన్నా తక్కువగా ఉండే రేణువులను పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం) 2.5గా పేర్కొంటారు. వీటికి డిమెన్షియాకు మధ్య సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

"క్యూబిక్‌ మీటరుకు ఒక మైక్టోగ్రాము మేర ఈ రేణువులు పెరిగినా డిమెన్షియా ముప్పు 16 శాతం మేర అధికమవుతుందని వెల్లడైంది. అల్జీమర్స్‌ తరహా డిమెన్షియా విషయంలోనూ ఇదే సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది" అని పరిశోధనకు నాయకత్వం వహించిన రేచల్‌ షాఫర్‌ తెలిపారు.

1994లో ప్రారంభమైన అధ్యయనంలో పాల్లొన్న 4వేల మంది సియాటిల్‌ నగర వాసుల వివరాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారిలో వెయ్యి మంది.. ఏదో ఒక సమయంలో డిమెన్షియాతో బాధ పడ్డారని వెల్లడైంది. వీరు సరాసరిన ఎంత మేర కాలుష్యానికి గురయ్యారన్నది పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధరణకు వచ్చారు. తీవ్రస్థాయి మతిమరుపు వ్యాధికి వాయుకాలుష్యం కూడా గణనీయంగానే కారణమవుతున్నట్లు స్పష్టమైందని వారు తెలిపారు. అయితే ఈ ముప్పును మనం సరిచేసుకోవచ్చన్నారు.

ఇదీ చూడండి: మతిమరుపా? అయితే జాగ్రత్త పడాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.