ETV Bharat / international

ఆకాశంలో ఎగిరొచ్చిన కరోనా టెస్టింగ్ కిట్లు!

author img

By

Published : May 17, 2020, 9:25 AM IST

Updated : May 17, 2020, 9:42 AM IST

testing kits transferred by drones
ఆకాశంలో ఎగిరొచ్చిన కరోనా టెస్టింగ్ కిట్లు!

ప్రాణం పోసే వైద్యులకు అందుకు కావల్సిన ఆయుధాలు అందుబాటులో లేకుంటే చాలా కష్టం. అందుకే, వైద్యపరికరాలను వేగంగా సరఫరా చేసేందుకు ఆధునిక డ్లోన్లను వినియోగిస్తున్నాయి కొన్ని దేశాలు. తాజాగా ఈ కరోనా విపత్తు సమయంలో రువాండాలో మెడికల్​ డ్రోన్లతో పరీక్ష కిట్లను డాక్టర్లకు చేరవేసింది.

ఆరోగ్య సంరక్షణ సేవల్లో డ్రోన్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ విషయంలో ఆఫ్రికాలోని రువాండా.. మిగతా వర్ధమాన దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ దేశంలో డ్రోన్ల ద్వారా ఇప్పటికే రక్తం యూనిట్లు, మందులు, మెడికల్‌ శాంపిళ్లతో పాటు అవయవాలను సైతం విజయవంతంగా తరలిస్తున్నారు.

ఎలాంటి ప్రాంతానికైనా సత్వరమే వైద్య సామగ్రిని పంపే ఈ డ్రోన్లను ప్రస్తుతం కొవిడ్‌-19 టెస్టింగ్‌ కిట్ల సరఫరాలోనూ వినియోగిస్తున్నారు. మరో ఆఫ్రికా దేశం ఘనాలోనూ ఈ ఒరవడి ప్రారంభమైంది. ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ ప్రాజెక్టు పేరిట ఈ తరహా మెడికల్‌ డ్రోన్లను భారత్‌లోనూ ప్రారంభించేందుకు ప్రపంచ ఆర్థిక ఫోరం చొరవ చూపుతోంది.

ఇదీ చూడండి:ఆ కుక్కలకు యజమానుల నుంచే కరోనా సోకింది

Last Updated :May 17, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.