ETV Bharat / international

40 మంది రైతులను బలిగొన్న ఉగ్రవాదులు

author img

By

Published : Nov 29, 2020, 4:07 PM IST

nigerian farmers attacked in nigeria boro state
'40మంది రైతుల్ని హతమార్చిన ఉగ్రవాదులు'

నైజీరియాలో ఓ ఉగ్ర మూక జరిపిన దాడుల్లో దాదాపు 40 మంది రైతులు మరణిించారు. స్థానిక బోకో హారమ్​​ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

నైజీరియా ఉత్తర బోరో రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 40 మంది రైతులు మరణించారు. గరిన్​-వాషిబి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

మృతుల్లో మత్స్య కారులు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోకో హారమ్​​ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్​ బుహారీ స్పందించారు. ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు సైన్యానికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టంచేశారు.

బోకో హారమ్​​ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని ఇటీవల బోర్నో రైతులు బంధించి, సైన్యానికి అప్పగించారు. అందుకు ప్రతీకారంగానే ముష్కరులు ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానిక అడ్వకేట్​ తెలిపారు.

ఇదీ చదవండి: అఫ్గానిస్థాన్​లో ఆత్మాహుతి దాడులు- 34 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.