ETV Bharat / international

యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన నోబెల్ శాంతి గ్రహీత!

author img

By

Published : Nov 27, 2021, 6:16 AM IST

ethiopia pm
ఇథియోపియా ప్రధాని

ఆయనో ప్రధాని, నోబెల్ శాంతి గ్రహీత(abiy ahmed ali nobel prize) కూడా. కానీ.. దేశాన్ని కాపాడుకునేందుకు స్వయంగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టారు. సైనిక దుస్తులు ధరించి, తుపాకీ చేతపట్టి సేనలను ముందుండి నడిపిస్తున్నారు. అంతర్యుద్దంతో రగిలిపోతున్న ఇథియోపియా ప్రధాని గురించే ఈ పరిచయమంతా..

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇథియోపియా ప్రధానమంత్రి(ethiopia prime minister) అబియ్ అహ్మద్ స్వయంగా యుద్ధభూమిలో అడుగుపెట్టారు. సైనిక దుస్తులు ధరించి, తుపాకీ చేతపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇథియోపియా(ethiopia civil war) ఈ నెల మొదట్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

టిగ్రే దళాలకు(abiy ahmed tigray) వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో సైన్యానికి దిశానిర్దేశం చేస్తానని ప్రకటించిన నాలుగు రోజులకే ఆయన ఈ పనిచేయడం విశేషం. ఇథియోపియా పొరుగునే ఉన్న టిగ్రే సరిహద్దు ప్రాంతాలైన అమ్హారా-అఫార్ వద్ద ప్రస్తుతం ఆయన(abiy ahmed ali news) తన సేవలందిస్తున్నారు. రెట్టింపు విశ్వాసంతో ఈ యుద్ధంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇథియోపియన్ దళాలు-టిగ్రే సేనల మధ్య నవంబర్ 2020లో చెలరేగిన ఘర్షణల్లో పదివేల మంది పౌరులు మరణించారు.

ఇథియోపియా పొరుగుదేశమైన ఎరిత్రియాతో సంబంధాలను(ethiopia eritrea relations) పునరుద్ధరించేందుకు చేసిన కృషికిగాను అబియ్‌ అహ్మద్ 2019లో నోబెల్ శాంతి(ethiopia-eritrea peace agreement) బహుమతిని అందుకున్నారు. మరోవైపు.. సైనిక యూనిఫాం ధరించి యుద్ధభూమిలో ఉన్న ప్రధానమంత్రి అబియ్ అహ్మద్​కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.