ETV Bharat / entertainment

Vijay Antonys Daughter Suicide : షాకింగ్​.. హీరో విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. అసలేమైంది?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 7:53 AM IST

Updated : Sep 19, 2023, 9:16 PM IST

Vijay Antonys Daughter Suicide : నటుడు, బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా (16) ఆత్మహత్య చేసుకుంది.

Vijay Antonys  Daughter Suicide : షాకింగ్​..  హీరో విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. అసలేమైంది?
Vijay Antonys Daughter Suicide : షాకింగ్​.. హీరో విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. అసలేమైంది?

Vijay Antonys Daughter Suicide : బిచ్చగాడు ఫేమ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రీసెంట్​గా ప్రమాదం నుంచి కోలుకున్న ఆయనకు మరో కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన పెద్ద కుమార్తె మీరా (16) ఆత్మహత్య చేసుకుంది. ఈమె చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఈమె చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో కోలీవుడ్​, టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. సక్సెస్ ఫుల్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్​ కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. చదువు ఒత్తిడి వల్ల అని కొంతమంది అంటున్నారు. తెల్లవారుజామున ఇంట్లో వాళ్ళు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్​కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని సమాచారం అందింది. దీంతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకుంటున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు.. మీరాకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆంటోనీకి ధైర్యం చెబుతున్నారు.

కాగా, బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మల్టీ టాలెంటెండ్​ హీరో విజయ్ ఆంటోనీ. ఈ చిత్రంలో తన నేచురల్ అండ్ ఎమోషనల్​ యాక్టింగ్​తో బాగా ఆకట్టుకున్నారు. ​ ఆ తర్వాత పలు సినిమాలతో ఆడియెన్స్​ను అలరించారు. ఓ వైపు నటుడిగా, మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్​గా కెరీర్​ను రాణిస్తున్నారు విజయ్ ఆంటోనీ. రీసెంట్​గానే బిచ్చగాడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రీసెంట్​గా హత్య అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్​ సినిమాతో అలరించారు. విజయ్.. నిర్మాత ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో ఒక కూతురు పేరే మీరా.

Vijay Antony Accident News : ఈ ఏడాది జనవరిలో విజయ్ యాంటోనీ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. మలేషియాలో బిచ్చగాడు 2 షూటింగ్​ సమయంలో బోటు యాక్సిడెంట్​కు గురయ్యారు. ఆయన ముఖానికి బోటు తగలడం వల్ల, దవడను సరిచేయడానికి సుమారు 9 ప్లేట్లు వేశారు. నెలన్నరపాటు లిక్విడ్‌ డైట్‌లోనే ఉన్నారు.

విజయ్​ ఆంటొనీ ముఖం మొత్తం గాయాలు, రక్తం.. కిందకు జారిన దవడ భాగం.. ఏం జరిగిందంటే?

బిచ్చగాడు-2 షూటింగ్​లో ఘోర ప్రమాదం.. విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలు

Last Updated :Sep 19, 2023, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.