ఫుల్​ యాక్షన్​ మోడ్​లో వెంకీ మామ.. ఈ సారి 'సైంధవ్'​గా

author img

By

Published : Jan 25, 2023, 3:55 PM IST

Updated : Jan 25, 2023, 5:44 PM IST

Venkatesh 75th movie

వెంకటేష్‌ 75వ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్​. ఇందులో వెంకీ మామ లుక్​ అదిరిపోయింది. మరోవైపు, వెంకటేశ్​ కీలక పాత్రలో నటిస్తున్న 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌' టీజర్​ కూడా విడుదలైంది.

ఫ్యామిలీ హీరో వెంకటేశ్​ తన కొత్త సినిమాను రీసెంట్​గా ప్రకటించారు. 'హిట్‌' సిరీస్​తో సక్సెస్​ను అందుకున్న శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్‌ మూవీగా ఇది రూపొందనుంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్‌ లుక్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

వెంకటేష్‌ 75వ(#Venky75)వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు 'సైంధవ్‌' అనే పేరును ఖరారు చేశారు. రెండు నిమిషాలు ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో వెంకటశ్​ గన్‌ పట్టుకుని కనిపిస్తూ 'నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..' అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పారు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీభాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవలే 'శ్యామ్‌ సింగరాయ' సినిమాతో క్లాసిక్‌ హిట్‌ను అందుకున్న నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంతోష్‌ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌' టీజర్​ రిలీజ్​..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌'. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందే (జనవరి 25న) ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో వెంకటేశ్‌ కీరోల్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, భాగ్యశ్రీ, భూమిక, మాళవిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్​చరణ్ అతిథి పాత్రలో మెరవబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఫ్యాన్స్​కు కల్యాణ్​ రామ్ ఫోన్​ కాల్​.. ​బాలయ్య సూపర్​ హిట్​ సాంగ్​తో సర్​ప్రైజ్​..

Last Updated :Jan 25, 2023, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.