ETV Bharat / entertainment

బాక్సాఫీస్​ వద్ద బాలయ్య జోరు.. మూడు రోజుల కలెక్షన్ ఎంతంటే..

author img

By

Published : Jan 15, 2023, 5:14 PM IST

Etv Bharat
Etv Bharat

Veera Simha Reddy collections : నట సింహం నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్​ను షేక్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన వీరసింహారెడ్డి సినిమా కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Veera Simha Reddy collections : 'అఖండ' తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో వచ్చిన బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి'. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ అభిమానుల సందడి మధ్య సంక్రాంతి పండుగ జోరును కొనసాగించేందుకు 'వీరసింహారెడ్డి' జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఊరమాస్​ సెలబ్రేషన్స్‌ కొనసాగుతున్నాయి. పండుగ రోజు తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు.

ఇప్పటికే ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా తొలి రోజు రూ.54 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ అధికారికంగా తెలిపింది. 'బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత' అని క్యాప్షన్ జోడించింది. ఈ ఊచకోత ఇంకా కొనసాగుతోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 76 కోట్ల మేర గ్రాస్, రూ. 47.88 షేర్​ సాధించింది ఈ సినిమా. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో కలిపి రూ.39.43 కోట్ల కలెక్షన్స్​ రాబట్టింది. ఈ సినిమాకు జరిగిన థియేట్రికల్​ బిజినెస్​లో దాదాపు 53 శాతం రికవరీ అయినట్టు తెలుస్తోంది.

కలెక్షన్లతో బాక్సాఫీస్​ వద్ద దూసుకుపోతున్న వీరసింహారెడ్డి సినిమా దర్శకుడు గోపిచంద్​ మలినేని తెలుగు ఆడియన్స్​కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినిమాను ఇంతగా ఆదరించి నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతున్నందుకు ప్రేక్షకుల​కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. "ఆశించాను కానీ ఊహించలేదు.. ఒక్క పంచ్​ తోనే బాక్సాఫీస్​ బద్దలుకొట్టే బాలయ్యబాబు కెరీర్​లోనే మా వీరసింహారెడ్డి పెద్ద హిట్​.. నాతోపాటు నా సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్​ కెరీర్​లో అతిపెద్ద హిట్​ వీరసింహారెడ్డి. ఇది వీరసింహ విజయం.. అందించిన ప్రేక్షకులందరి జీవితాలూ ప్రతి నిమిషం విజయవంతమై ప్రతిరోజూ సూపర్ హిట్​ కావాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు" అని గోపిచంద్​ ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.