ETV Bharat / entertainment

వర్ష మెడలో తాళి కట్టిన ఇమ్మాన్యుయెల్

author img

By

Published : Nov 5, 2022, 9:59 PM IST

Varsha Emmanuel Marriage: 'జబర్దస్త్' ప్రోగ్రామ్ చూసే వాళ్లకు ఇమ్మాన్యుయెల్, వర్ష లవ్ ట్రాక్ తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాళ్లు ఒక అడుగు ముందుకు వేశారు. జడ్జి పోసాని కృష్ణ మురళి క్లారిటీ అడగడం వల్ల స్టేజ్​ మీదే వర్ష మెడలో ఇమ్మూ తాళి కట్టాడు.

Varsha Emmanuel Marriage
Varsha Emmanuel Marriage

Varsha Emmanuel Marriage: బుల్లితెర వీక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు 'జబర్దస్త్'​ షోలో ఆన్​స్క్రీన్​ కెమిస్ట్రీ, లవ్​ట్రాక్​ క్రియేట్​ చేయడం మాములే. అయితే ఇందులో భాగంగా ఇమ్మాన్యుయెల్​-వర్ష జోడీకి ఓ స్పెషల్​ క్రేజ్ ఉంది. ఎన్నో ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. పైగా వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న విషయాన్ని ఈ జంట పలుమార్లు పరోక్షంగానూ తెలిపింది. అయితే తాజాగా విడుదలైన ఎక్స్​ట్రా జబర్దస్త్​ కొత్త ప్రోమోలో ఇమ్మాన్యుయెల్​ వర్ష మెడలో తాళి కట్టినట్లు చూపించారు. అసలు వివరాల్లోకి వెళితే..

'ఎక్స్​ట్రా జబర్దస్త్'కు నటుడు పోసాని కృష్ణమురళి జడ్జిగా వచ్చారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో గతంలో ఇమ్మాన్యుయెల్, వర్ష మధ్య ట్రాక్ చూపించారు. అందులో 'మీ అమ్మకు చెప్పు.. కోడలు వస్తుందని' డైలాగ్ కూడా ఉంది. ప్రోమో వరకు మాత్రమే డైలాగులు చెబుతుందని వర్షపై ఇమ్మాన్యుయెల్ సెటైర్ వేశారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా? లేదా? అని పోసానికి డౌట్ వచ్చింది. దీంతో 'ఇమ్మాన్యుయెల్.. ఒక క్లారిఫికేషన్ కావాలి. మీ ఇద్దరి మధ్య లవ్ ఉందిగా?' అని పోసాని కృష్ణమురళి అడిగారు. 'అది ఆ అమ్మాయే చెప్పాలి' అని అతడు రిప్లై ఇచ్చాడు.

'ఎంత దొంగ నువ్వు?' అని పోసాని అంటే.. 'అందరి ముందు చెబుతున్నాను. ఆ అమ్మాయి లవ్ ఉందంటే చెప్పమనండి. ఇప్పటికి ఇప్పుడే తాళి కట్టేస్తా' అని ఇమ్మాన్యుయెల్ అన్నాడు. ఆ తర్వాత గెటప్ శ్రీను తాళి తీసుకు రావడం, స్టేజ్​ మీద అందరి ముందు ఇమ్మాన్యుయెల్ తాళి కట్టడం జరిగినట్టు ప్రోమోలో చూపించారు. ఇది స్క్రిప్ట్‌లో భాగమని నెటిజన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే స్కిట్‌లో ఏం జరిగిందనేది తెలియాలంటే నవంబర్ 11న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.