ETV Bharat / entertainment

'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్డేట్​.. 'బాస్​ పార్టీ'కి గెట్ రెడీ!

author img

By

Published : Nov 20, 2022, 5:01 PM IST

VALTAIR VEERAIAH movie NEW update
VALTAIR VEERAIAH movie NEW update

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్​ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఇది ఫ్యాన్స్​కు పూనకాలు తెచ్చేలా ఉంది. అదేంటంటే..

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ప్రస్తుతం ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. సినిమాకు సంబంధించిన మొదటి పాటను 23 నవంబర్​ 2022న సాయంత్రం 4.50 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. 'బాస్​ పార్టీ' అనే పాటను విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్​లో మెగాస్టార్​ ఊరమాస్​ స్టెప్పులేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. చిరు.. లుంగీ కట్టుకుని, ఉంగరాలు, కడియం, చెవి పోగుతో చిరు మాస్‌ గెటప్‌లో అదిరిపోయారు. డీఎస్పీ బీట్స్.. బాస్​ స్టెప్స్​ తోడైతే ఫ్యాన్స్​కు పూనకాలే.

VALTAIR VEERAIAH NEW POSTER
వాల్తేరు వీరయ్య

మాస్‌ ఎంటర్‌ టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. చిత్ర బృందం ఈ సన్నివేశాలు తెరకెక్కించడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ యేర్నేని, వై.రవి శంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

VALTAIR VEERAIAH NEW POSTER
వాల్తేరు వీరయ్య

ఇవీ చదవండి : ప్రముఖ యువ నటి కన్నుమూత.. కారణం ఇదే!

స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని సమంత.. ఫైట్స్ చూస్తే అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.