ETV Bharat / entertainment

విష్ణు X మనోజ్​.. 'ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి' అంటూ వీడియో షేర్‌.. కాసేపటికే..

author img

By

Published : Mar 24, 2023, 12:30 PM IST

Updated : Mar 24, 2023, 1:44 PM IST

tollywood-hero-manchu-manoj-shares-a-video-related-an-issue
tollywood-hero-manchu-manoj-shares-a-video-related-an-issue

నటుడు మంచు మనోజ్​.. తాజాగా షేర్​ చేసిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. అందులో మంచు విష్ణు ఎవరిపైనో ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించారు. అసలేం జరిగింది?

టాలీవుడ్​ స్టార్​ హీరోస్​​ మంచు మనోజ్​, విష్ణులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇళ్లల్లోకి వచ్చి ఇలా దాడికి దిగుతుంటారంటూ అంటూ నటుడు మనోజ్​ పోస్ట్​ చేసిన వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఆ వీడియోలో "ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్కడి పరిస్థితి" అంటూ మంచు మనోజ్‌ మాట్లాడగా ఆ సమయంలో మంచు విష్ణు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించారు.

"వాడు ఏదో అన్నాడు కదా ఒరేయ్‌ గిరేయ్‌ అని" అంటూ మంచు విష్ణు ఎవరి మీదనో కేకలు వేస్తూ కనిపించగా అదే ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆయన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంచు విష్ణు అంతలా ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగింది? అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇదే వీడియోను తన సోదరుడు మంచు మనోజ్‌.. సామాజిక మాధ్యమాలు ఫేస్​బుక్​, ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేసి కాసేపటికే ఆ పోస్ట్​ను డిలీట్​ చేశారు.

ఇటీవలే మంచు మనోజ్​ రెండో వివాహం ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్​ ఏడడగులు నడిచారు. మొత్తం పెళ్లి బాధ్యతలను మనోజ్​ అక్క మంచు లక్ష్మి దగ్గరుండి చూసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకల్లో మనోజ్​ సోదరుడు మంచు విష్ణు ఎక్కువ సమయం గడపలేదని వార్తలు వచ్చాయి. కేవలం అతిథిగానే వచ్చి వెళ్లనట్లు నెటిజన్లు మాట్లాడుకున్నారు.

ఇప్పుడు ఈ వీడియో వైరల్​ కావడంతో నెట్టింట మంచు సోదరుల మధ్య ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. తాజాగా మంచు మోహన్​బాబు పుట్టినరోజు వేడుకల్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు దూరంగానే ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. మోహన్‌ బాబు, విష్ణు స్టేజీ మీద ఉండగా.. మనోజ్‌ ఎక్కడో దూరంగా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. అసలు ఈ వీడియో గురించి మంచు ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక మనోజ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన గతంలో 'అహం బ్రహ్మాస్మి' అనే పాన్ ఇండియా సినిమా ప్రకటించారు. కానీ ఇది మధ్యలోనే నిలిచిపోయింది. రీసెంట్​గా మళ్లీ 'వాట్‌ ది ఫిష్‌' అనే డిఫరెంట్​ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నట్లు తెలిపారు.

Last Updated :Mar 24, 2023, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.