ETV Bharat / entertainment

Thalaivar 170 Update : రజనీ ఫ్యాన్స్​కు కిక్కిచ్చే న్యూస్.. 'తలైవా 170' షూటింగ్ షురూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 2:47 PM IST

Updated : Oct 4, 2023, 3:11 PM IST

Thalaivar 170 Update : రజనీకాంత్-టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి తాజాగా మరో అప్​డేట్ వచ్చింది. అదేంటంటే?

Thalaivar 170 Shooting
Thalaivar 170 Shooting

Thalaivar 170 Update : తమిళ్ సూపర్​స్టార్ రజనీకాంత్-టీజే జ్ఞానవేల్ కాంబోలో ఓ చిత్రం రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 'తలైవా 170' అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ బ్యానర్​పై సుభాస్కరణ్ భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో నటించనున్న పలువురు స్టార్ల వివరాలు తెలిపుతూ.. స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్​.

  • Lights ☀️ Camera 📽️ Clap 🎬 & ACTION 💥

    With our Superstar @rajinikanth 🌟 and the stellar cast of #Thalaivar170🕴🏼 the team is all fired up and ready to roll! 📽️

    Hope you all enjoyed the #ThalaivarFeast 🍛 Now it's time for some action! We'll come up with more updates as the… pic.twitter.com/gPUXsPmvEQ

    — Lyca Productions (@LycaProductions) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ క్రమంలో కథానాయికలు మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌, టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ ఫహాద్​ ఫాజిల్​, బాలీవుడ్ బిగ్​బి అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్​లో భాగమైనట్లు తెలిపింది. ఇక నటీనటుల కన్ఫర్మేషన్​ తర్వాత తాజాగా.. మరో ఇంట్రెస్టింగ్ అప్​డేట్​ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఇక షూటింగ్ జరుగుతుండగా.. మరిన్ని అప్​డేట్స్​ తెలియజేస్తామని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది.

Thalaivar 171 Update : ఇటీవలే రజనీకాంత్ 171 సినిమా గురించి అదిరిపోయే అప్​డేట్ వచ్చింది. 'విక్రమ్' ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్​తో రజనీ మూవీ కన్ఫార్మ్ అయ్యింది. 'తలైవార్ 171' అనే వర్కింగ్ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్​పై రూపొందనున్న ఈ సినిమాకు.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఈ మేరకు సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్​లో వెల్లడించింది.

ఇక రజనీ-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను రాబట్టి.. అనేక రికార్డుల్ని నెలకొల్పింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ ప్లాట్​ఫామ్​లోనూ ఎక్కువ వ్యూస్​ మినిట్స్‌ సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. రజనీ యాక్టింగ్​, డైలాగులకు ఫ్యాన్స్​, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్​ కూడా వచ్చే అవకాశముందని, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ అందుకోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని టాక్ వినిపిస్తోంది.

Rajinikanth Sharukh Khan : గత పదేళ్ల లెక్క తేల్చేశారు.. రూ.2500కోట్లు!

Rajinkanth Golden Ticket : అప్పుడు బిగ్​బీ.. ఇప్పుడు సూపర్​స్టార్.. 'జైలర్'​ హీరోకు బీసీసీఐ 'గోల్డెన్​ టికెట్'​!

Last Updated : Oct 4, 2023, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.