ETV Bharat / entertainment

సూపర్​ స్టార్​ కృష్ణ గురించి ఈ ఆసక్తికర విషయాలు ఎప్పుడైనా విన్నారా?

author img

By

Published : Nov 15, 2022, 5:21 PM IST

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానులు సినీప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

Super star Krishna Interesting facts
సూపర్​ స్టార్​ కృష్ణ గురించి ఈ ఆసక్తికర విషయాలు ఎప్పుడైనా విన్నారా

  • పద్మాలయ సంస్థ నిర్మించిన తొలిహిందీ చిత్రం 'టక్కర్‌' 1980లో విడుదలైంది.
  • న్యూదిల్లీలో జరిగిన 7వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కృష్ణ నటించిన ఏజెంట్‌గోపి, ఇంద్రధనస్సు చిత్రాలు ప్రదర్శించారు.
  • కృష్ణను అందంగా తీర్చిదిద్దిన మేకప్‌మేన్‌ పేరు మాధవరావు.
  • తను ఎంత బిజీగా ఉన్నా ప్రతి శని, ఆదివారాల్లో, హాలిడేస్‌లో పిల్లలతో గడిపేవారు. ప్రతి వేసవికి వారిని ఊటీకి తీసుకువెళ్లేవారు.
  • అమితాబ్‌ కేబీసీ ప్రోగ్రామ్‌ కృష్ణకు బాగా నచ్చింది. ఎవరైనా అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో వస్తే చేయాలని ఉండేదట.
  • అమ్మా,నాన్న చనిపోయినప్పుడు తప్ప కృష్ణ మరెప్పుడూ ఏడవలేదట. కానీ.. సినిమాల్లో సెంటిమెంట్‌ సీన్స్‌ చూస్తే చాలు కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయట.
  • 'కృష్ణ' పాట ఉంటే హిట్‌ అవుతుందని భావించి చాలా సినిమాల్లో ఆయనతో ఒక సాంగ్‌ చేయించేవారు. అలా 'యమలీల'లో కృష్ణ స్పెషల్‌ సాంగ్‌ ఎంతో గుర్తింపు పొందింది.
  • పద్మాలయ బ్యానర్‌లో కృష్ణ నిర్మించిన హిందీ చిత్రాలు 'హిమ్మత్‌వాలా'(తెలుగులో 'ఊరికిమొనగాడు'), 'మవాలి'(తెలుగులో 'చుట్టాలున్నారు జాగ్రత్త') , 'పాతాళభైరవి'(తెలుగులో 'పాతాళభైరవి'). ఉత్తరాదినే కాక హైదరాబాద్‌లోనూ ఈ మూడు హిందీ చిత్రాలు డైరెక్ట్‌గా సిల్వర్‌జూబ్లీలు(175 రోజులు పైగా) ఆడిన చిత్రాలుగా రికార్డుల్లో నిలిచాయి.
  • హైదరాబాద్‌లో తొలిసారిగా 18లక్షలకుపైగా (దేవి 70ఎమ్‌.ఎమ్‌) కలెక్షన్‌ వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం 'సింహాసనం'.
  • 1965 నుంచి 2009 వరకు 44 ఏళ్లు.. ఏ సంవత్సరమూ గ్యాప్‌ రాకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ
  • కృష్ణకు అభిమాన సంఘాల సంఖ్య : 2500కు పైగానే

షూటింగ్‌ సమయంలో కృష్ణ.. కృష్ణ షూటింగ్‌ విషయానికొస్తే... చాలా రిజర్వుడ్‌గా ఉంటారు. తన పనీ... తన ప్రొడ్యూసర్లు, వాళ్ల సాధక బాధకాలు, షెడ్యూలు వర్క్‌ తప్ప మిగతా విషయాల మీద ఆసక్తి చూపించేవారు కాదు. సర్కస్‌ ఫీట్స్‌ ఎలా సిస్టమెటిక్‌గా జరుగుతాయో అలా జరిగిపోతుండేవి షూటింగులు. కృష్ణ కాంపౌండ్‌ ఓ సినిమా ఫ్యాక్టరీలా ఉండేది. సినిమా మొదలయిందంటే పూర్తయ్యే వరకూ నిద్రాహారాలు ఎవరికీ ఉండేవి కావు. అయినా అది అందరికి మధురానుభూతి.

Super star Krishna Interesting facts
షూటింగ్​లో సూపర్​ స్టార్​ కృష్ణ

మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌.. 1982లో కృష్ణ, బాపు కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చింది. కృష్ణకు గొప్ప సెన్సాఫ్‌ హ్యుమర్‌ ఉంది. ఆ సినిమా డ్యాన్స్‌ డైరెక్టర్‌ శ్రీనుతో కృష్ణ మాట్లాడుతూ ‘‘పాపం బాపు గారు, సాక్షి తర్వాత పదిహేనేళ్లయ్యింది కదా.. నటనలో మెరుగుపడి ఉంటానని అనుకుంటున్నారు. ఏం మారలేదని హామీ ఇవ్వండి’’ అని చెప్పి పకపకా నవ్వారట. బాపు మాములుగా సినిమా ఓపెనింగ్‌కు వెళ్లరట. కానీ, ఈ సినిమా ఓపెనింగ్‌కు వచ్చారు. ఈ సినిమాలో ఒక పాత్ర కృష్ణని ‘ఒరే వెధవా’ అని తిడతాడు. ఆ డైలాగ్‌ వచ్చిన తర్వాత హాలంతా గోలగోల చేసేశారు. అదీ కృష్ణ సూపర్‌ స్టార్‌డమ్‌! సినిమా అవగానే ఒకాయన బాపు వద్దకు వచ్చి.. షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ‘కంగ్రాట్స్‌ గొప్ప ఫ్లాప్‌ తీశారు’ అని అన్నాడు. కానీ సినిమా బాగా ఆడింది. బాగా డబ్బులొచ్చాయి. దీనితో బాపు పాత అప్పులు తీర్చేశారు.

Super star Krishna Interesting facts
సూపర్​ స్టార్​ కృష్ణ

ఇదీ చూడండి: కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు తారక్​ బన్నీ రామ్​చరణ్​ ఇంకా ఎవరెవరు వచ్చారంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.