ETV Bharat / entertainment

హీరోలను ఒప్పించడం డైరెక్టర్లకు తలనొప్పిగా మారిందా?.. సుకుమార్​కూ ఆ పాట్లు తప్పలేదా?

author img

By

Published : Feb 20, 2023, 12:37 PM IST

Stars with bounded script has become a herculean task for directors  Sukumar and Koratala spent a Year on NTR30 and Pushpa
Stars with bounded script has become a herculean task for directors Sukumar and Koratala spent a Year on NTR30 and Pushpa

టాలీవుడ్​ హీరోలను ఒప్పించడం పాత, కొత్త​ డైరెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిందా?.. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. స్టార్​ డైరెక్టర్లు సుకుమార్​, కొరటాల శివకు కూడా ఆ పాట్లు తప్పలేదట. టాలీవుడ్​లో అసలేం జరుగుతోంది?

కొవిడ్ మహమ్మారి తర్వాత సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. ఒక్కప్పుడు స్టార్​ హీరోల సినిమాలకే ప్రాధాన్యమిచ్చే ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్​ ఉండే చిన్న సినిమాలను చూసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో మారుతున్న ట్రెండ్​కు తగ్గట్టుగా మన స్టార్​ హీరోలు కూడా మారుతున్నారు. ఇది వరకు భారీ బడ్జెట్​తో సినిమాలు తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఉన్న హీరోలు సైతం అటు బడ్జెట్​ను దృష్టిలోఉంచుకుని ఇటు కంటెంట్​కు ఇంపార్టెన్స్​ ఇస్తున్నారు. అలా ప్రతి సినిమాకు డిఫరెంట్​ కాన్సెప్ట్​లతో పని చేయడానికి ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. అంతే కాకుండా పాన్​ ఇండియా మూవీ ట్రెండ్​ నడుస్తున్న ఈ కాలంలో ఇప్పటి వరకు రీజనల్​ లెవెల్​కే పరిమితం చేసిన తమ సినిమాలను పాన్​ ఇండియా లెవెల్​కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శకులు సైతం ఓ వైపు తమ స్టైల్​ను మార్చుకుంటూ మరో వైపు సినిమాలో కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

అయితే స్టార్​ హీరోలను మెప్పించడం ఇప్పుడు డైరెక్టర్లకు పెద్ద టాస్క్​గా మారిందట. ఓ కథను రెడీ చేసేందుకు ఎంతైతే కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ ఎఫర్ట్​తో హీరోలను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు హీరోలకు కాన్సెప్ట్​ అంతగా నచ్చకపోవచ్చు.. లేకుంటే స్క్రిప్ట్​లో మార్పులు చేస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పొచ్చు. దీంతో డైరెక్టర్​లతో పాటు స్క్రిప్ట్​ రైటర్లు.. కథలో మార్పులు చేర్పులు చేసేందుకు ఇంకాస్త సమయం తీసుకుంటారు. అలా ఎన్నో ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు ఆలస్యమైన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా టాలీవుడ్​లో అదే జరిగింది. మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్ 16వ సినిమా కోసం జెర్సీ దర్శకుడు గౌతమ్​ తిన్ననూరి ఓ కథను రెడీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్క్రిప్ట్​ను చరణ్​ రిజెక్ట్​ చేశారట. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్​ దేవరకొండకు ఓ స్టోరీ వినిపించారట. ఆ స్టోరీ విజయ్​కు బాగా నచ్చడంతో గౌతమ్​ తిన్ననూరికి ఓకే చెప్పారట.

మరోవైపు కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ శిష్యుడు నార్తన్​ కూడా దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. కన్నడలో శివరాజ్​కుమార్​తో ఓ సినిమా హిట్​ కొట్టడంతో ఇండస్ట్రీలో ఈయన పేరు మారుమోగిపోయింది. దీంత ఆయనకు మంచి డిమాండ్​ ఏర్పడింది. అలా ఈ డైరెక్టర్​ ఆర్​సీ 16ను తెరకెక్కించేందుకు చరణ్​తో చేతులు కలిపారట. కానీ ఈ డైరెక్టర్​ కూడా ఆర్​సీ 16కు దూరమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నర్తన్​ లిస్ట్​లో విజయ్​ దేవరకొండ కూడా ఉన్నారట. అయితే విజయ్​తో కూడా ఈయన సినిమా తీయట్లేదని వార్తలు వచ్చాయి.

అప్​కమింగ్​ డైరెక్టర్స్​కే కాదు స్టార్​ డైరెక్టర్స్​ కూడా ఈ తిప్పలు తప్పట్లేదట. అంతా ఓకే అని స్టోరీ రెడీ చేసుకుని హీరోలకు కథ వినిపిస్తే.. కొంతమంది సుతిమెత్తంగా కథను తిరస్కరిస్తున్నారట. అయితే టాప్​ డైరక్టర్స్​ను రిజెక్ట్​ చేయకూడదనో లేకుంటే స్టోరీ ఇంకాస్త మారిస్తే బాగుంటుందనో భావించే హీరోలు మాత్రం దర్శకులకు కథల్లో మార్పులు చేస్తే ఓకే చెప్తామని ఆఫర్లు ఇస్తున్నారట. దీంతో డైరెక్టర్లు కూడా హీరో ఓకే చెప్తే చాలు ఇక కథ పని మేము పడతాం అంటూ కసరత్తులు చేస్తున్నారట. అలా స్టార్​ డైరెక్టర్​ సుకుమార్​ ఫుష్ప ద రూల్స్​ కోసం ఏడాది కష్టపడ్డారట.

సుకుమార్​ లాగే కొరటాల శివ కూడా ఎన్టీఆర్​ 30 కోసం దాదాపు సంవత్సరం పాటు వర్కౌట్​ చేశారట. ఆచార్య ఫ్లాప్​తో నిరాశ చెందిన కొరటాల.. ఇక సినిమాల విషయాల్లో జాగ్రతలు వహిస్తున్నారట. అందుకే జూనియర్​ ఎన్టీఆర్​తో ప్లాన్​ చేసిన తన అప్​కమింగ్​ మూవీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.