ETV Bharat / entertainment

Guess Who is This Cute Looking Child: ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టగలరా..? టాలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 4:01 PM IST

Updated : Sep 17, 2023, 5:29 PM IST

Star Actress Childhood Photo Story: సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు, వారి వ్యక్తిగత విషయాలు అంటే.. ఫ్యాన్స్​కు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అలాంటి ఓ విషయమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. స్కూల్​ యూనిఫామ్​లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. టాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్​ హీరోయిన్ గా కొనసాగుతోంది. మరి, ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

Star_Actress_Childhood_Photo_Story
Star_Actress_Childhood_Photo_Story

Star Actress Childhood Photo Story: సినీ హీరో హీరోయిన్ల పర్సనల్​ విషయాలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. వాళ్లకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నెట్టింట్లో తెగ వెతుకుతారు. అలానే హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు కూడా తెగ వైరల్​ అవుతాయి. అలాంటి ఓ విషయమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. స్కూల్​ యూనిఫామ్​లో కనిపిస్తున్న ఈ చిన్నారి.. టాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది​. ఈ బ్యూటీ మరెవరోకాదు.. "రెండు మతాలు.. రెండు కులాలు.. హైబ్రిడ్​ పిల్ల.." అంటూ కుర్రాళ్ల గుండెలను పిండేసిన సాయి పల్లవి..!

Star Actress Childhood Photo Story : సాయిపల్లవి
Star Actress Childhood Photo Story : సాయిపల్లవి

Actress Sai Pallavi Childhood Photos: సాయి పల్లవి పూర్తి పేరు సాయిపల్లవి సెంతామరై కన్నన్​. ఆమె పేరు చెప్తే ఠక్కున గుర్తుకు వచ్చేది.. అందం.. అభినయంతోపాటు డ్యాన్స్​. సాయిపల్లవి.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్​లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సాయిపల్లవి తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సెంతామరై కన్నన్, రాధామణి. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చిందని సమాచారం. సాయి పల్లవి తల్లి ఓ నర్తకి. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజ కవల పిల్లలు. సాయిపల్లవి కోయంబత్తూరులో పాఠశాలలో చదవింది. తల్లి ప్రభావంతో ఈమెకు కూడా డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.

Sai Pallavi Bollywood Movie : ఆ స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. షూటింగ్ కూడా షురూ అయిందట!

పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా స్టేజ్‌షోలపై నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతిలో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశం ఇచ్చాడు. తర్వాత 2005లో మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో సాయి పల్లవి నటించింది. అయితే సాయి పల్లవి బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె తండ్రి జార్జియాలో మెడిసన్ చదవడానికి పంపించేశారు.

నాలుగేళ్ల పాటు.. చదువు పూర్తి చేసిన తర్వాత.. ఈ ముద్దుగుమ్మ 2015లో మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ సినిమా హిట్ కావడంతో.. సాయిపల్లవికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఫిదా" సినిమాలో భానుమతి పాత్ర పోషించి తెలుగు వారికి మరింత దగ్గరైపోయింది. తర్వాత నాని సరసన మిడిల్​ క్లాస్​ అబ్బాయి(MCA) చిత్రంలో నటించింది. సూర్యా 36, కణం, మారి 2, శ్యామసింగరాయ, విరాటపర్వం, గార్గి వంటి పలు చిత్రాలలో నటించింది సాయి పల్లవి.

Star Actress Childhood Photo Story : సాయిపల్లవి
Star Actress Childhood Photo Story : సాయిపల్లవి

Sai Pallavi Habit : సాయి పల్లవికి విచిత్రమైన అలవాటు.. వాటితో ఏం చేస్తుందో తెలుసా?

అయితే సాయిపల్లవి కేవలం నటనలోనే కాకుండా డ్యాన్సులు కూడా ఇరగదీస్తది. ఈటీవీ ఛానల్​లో 2009లో వచ్చిన ఢీ 4 లేడిస్​ స్పెషల్​లో పాల్గొని ఫైనల్​ వరకు వెళ్లడమే కాకుండా.. మూడో రన్నరప్​గా నిలిచింది. సినిమాల్లో కూడా హీరోలకు ధీటుగా తగ్గేదే లే అంటూ డాన్స్ తో దుమ్ము లేపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్​లో ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ చిత్రంలో హీరోగా నటిస్తోందని టాక్. త్వరలో సాయిపల్లవి పేరును అధికారికంగా ప్రకటించనున్నారంటూ బాలీవుడ్‌ సమాచారమ్.

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ స్టార్​​.. ఆమే నా క్రష్​ అంటూ..

ఆ పార్ట్​కు సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి.. నిజమేనా?

సాయిపల్లవికి అందుకేనా ఈ రేంజ్​ ఫ్యాన్ ఫాలోయింగ్​.. సీక్రెట్​ తెలిసిపోయిందిగా!

Last Updated :Sep 17, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.