ETV Bharat / entertainment

నాలుగో రోజు కూడా తగ్గని కలెక్షన్ల వర్షం.. బాలీవుడ్​ బాద్​షా సృష్టిస్తున్నాడుగా నయా రికార్డులు..!

author img

By

Published : Jan 29, 2023, 1:41 PM IST

Updated : Jan 29, 2023, 6:26 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్. రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్​ను షేక్​ చేసిన ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది.

sharukh khan movie pathan 4th day box office collections
sharukh khan movie pathan 4th day box office collections

రిలీజ్​కు ముందు అయితే ఈ సినిమాను బ్యాన్​ చేయాలంటూ బాయ్​కాట్​ గ్రూప్​ సామాజిక వేదికలో గళమెత్తింది. అయితే కట్​ చేస్తే ఇదే సినిమా ఇప్పుడు 'టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ'గా మారింది. అదే షారుక్​ 'పఠాన్‌' మూవీ. జనవరి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.313 కోట్ల (గ్రాస్‌) బిజినెస్‌ చేసి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హిందీ సినిమాగా రికార్డుకెక్కగా ఇప్పుడు ఈ రికార్డును కూడా బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది.

భారత్​లో ఈ సినిమా నాల్గవ రోజు 55 కోట్లు వసూలు చేసింది. కాగా తొలిరోజు రూ. 57 కోట్లు, రెండో రోజు రూ.70.50 కోట్లు, మూడో రోజు రూ.39.25 కోట్లు వసూళ్లు చేసింది. రిప్లబిక్​డే కు హాలిడే కావడంతో ఆ రోజు అత్యధిక స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయని ట్రేడ్​ వర్గాల సమాచారం. విడుదలైన రోజే రూ. 106 కోట్లు సాధించిన ఈ సినిమా బీటౌన్​లో సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా రెండు, మూడో రోజులు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణెలు కీలక పాత్రలు పోషించారు. యష్ రాజ్ ఫిలీంస్ నిర్మణ సంస్థలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదట బాయ్ కాట్ సెగ గట్టిగానే తగిలింది. కానీ వాటన్నిటిని అధిగమించి షారుఖ్ పఠాన్ దూసుకెళ్తోంది. అనేక బాలీవుడ్ రికార్డులను ఇట్టే బద్దలు కొడుతోంది.

Last Updated :Jan 29, 2023, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.