ETV Bharat / entertainment

సర్కారు వారి 'టైటిల్'​ సాంగ్ అప్డేట్​​.. 'కేజీఎఫ్-​2'పై బన్నీ కామెంట్స్

author img

By

Published : Apr 22, 2022, 4:07 PM IST

Movie Updates: మిమ్మల్ని పలకరించేందుకు సినీ అప్డేట్స్​ మరోసారి వచ్చాయి. ఇందులో 'సర్కారు వారి పాట', బిగ్​బీ 'జుండ్'​ మూవీ సంగతులు ఉన్నాయి. బాక్సాఫీస్​ను షేక్​ చేసిన 'కేజీఎఫ్​2' చిత్రంపై అల్లుఅర్జున్​ ప్రశంసల వర్షం కురిపించారు.

Movie updates
Movie updates

Sarkaru vaari paata update: సూపర్​స్టార్ మహేశ్​బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట'. వరుస హిట్​లతో దూసుకెళ్తున్న మహేశ్​.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదివరకు విడుదలైన టీజర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. కళావతి పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో పాట 'పెన్నీ'లో మహేశ్ ముద్దుల కుమార్తె సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్​గా మారింది. దీంతో సినిమా తర్వాతి అప్డేట్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

చిత్ర నిర్మాతలు​ కొత్త అప్డేట్​ ఇచ్చారు. మోత మోగిపోవాలా అంటూ శ‌నివారం 11.07 గంట‌ల‌కు చిత్ర టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. బ్యాంకింగ్ స్కామ్‌ల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లు సినీ వర్గాల టాక్. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ సంస్థ‌ల‌తో క‌లిసి మ‌హేష్​బాబు స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

AlluArjun Comments On KGF 2 Movie: కన్నడ హీరో యశ్ న‌టించిన 'కేజీఎఫ్-2' సినిమా.. భారీ విజ‌యాన్ని అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖలంతా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. 'కేజీఎఫ్‌-2 సినిమా యూనిట్‌కు అభినంద‌న‌లు. ఈ సినిమాలో య‌శ్ న‌ట‌న అద్భుతం. సంజ‌య్ ద‌త్, రవీనా టాండన్, శ్రీ‌నిధి శెట్టి పాత్రలు అంద‌రినీ ఆకర్షించేలా ఉన్నాయి. సంగీత ద‌ర్శ‌కుడు రవి బస్రూర్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్లు అంద‌రికీ నా అభినంద‌న‌లు' అని ట్వీట్​ చేశారు అల్లుఅర్జున్​.

మరో ట్వీట్‌లో 'ప్రశాంత్‌ నీల్‌ అద్భుతమైన సినిమా అందించారు. మీరు ఏదైతే కలగన్నారో దాన్ని నిజం చేసి చూపించారు. ఇంత మంచి అనుభవాన్నిచ్చినందుకు, భారతీయ సినిమా ఖ్యాతిని శిఖర స్థాయిలో నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చారు బన్నీ.

Amitabhbachan Jund Movie In OTT: బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా 'జుండ్‌'. నాగ్​పుర్​కు చెందిన ప్రముఖ ఫుట్​బాల్​ కోచ్​ విజయ్​ బార్సే జీవితం ఆధారంగా డైరెక్టర్‌ నాగరాజ్‌ మంజులే ఈ​ సినిమాను తెరకెక్కించారు. అంకుశ్‌, ఆకాష్‌, రింకు సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు. విజయ్ బార్సే పాత్రలోకి అమితాబ్​ పరకాయ ప్రవేశం చేశాడు. టీ సిరీస్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదలవ్వగా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. డిజిటల్‌ రైట్స్‌ సొంతం చేసుకున్న జీ5లో 'జుండ్' అలరించనుంది. మే 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్​.

ఇవీ చదవండి: మనాలీలో రణ్​బీర్​తో రష్మిక.. షాహిద్ 'జెర్సీ'పై నాని కామెంట్

'ఆచార్య'లో మహేశ్‌ కూడా.. థ్యాంక్స్​ చెబుతూ చిరు ట్వీట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.