ETV Bharat / entertainment

విజయ్ ఫ్యాన్స్​ను 'ఖుషి' చేసిన సామ్​.. వచ్చే నెలలోనే!

author img

By

Published : Feb 17, 2023, 6:31 AM IST

విజయ్​ దేవరకొండ 'ఖుషి' సినిమా షూటింగ్​లో పాల్గొనేందుకు హీరోయిన్​ సమంత సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎప్పుడు నుంచి ఆమె సెట్​లోకి అడుగుపెట్టనుందంటే?

samantha khusi movie shooting
విజయ్ ఫ్యాన్స్​ను ఖుషీ చేసిన సామ్​

మయోసైటిస్​ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స్టార్​ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణలో పాల్గొంటోంది. అయితే ఇటీవలే ఈ వ్యాధి కారణంగా షూటింగ్​లకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో విజయ్​ దేవరకొండతో నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్​కు కూడా విరామం ఇచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్​ తాత్కాలికంగా నిలిచిపోయింది.

ఈ విషయంపై సామ్​ ఇటీవలే మాట్లాడింది. "విజయ్ దేవరకొండ అభిమానులను నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఖుషి సినిమా త్వరలోనే మళ్లీ ప్రారంభం అవుతుంది" అని ట్విట్టర్​ వేదికగా తెలిపింది. కానీ కరెక్ట్​గా ఎప్పుడు సెట్స్​లోకి అడుగుపెడుతుందో చెప్పలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మరో వార్త తెలిసింది. అదేంటంటే.. వచ్చే నెల మార్చి రెండో వారం నుంచి సమంత షూటింగ్​లో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటులు అలీ, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత తొలిసారిగా ఈ సినిమా కోసం జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

సమంత సినీ కెరీర్ విషయానికొస్తే.. త్వరలోనే ఆమె నటించిన 'శాకుంతలం' విడుదల కానుంది. ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సిటాడెల్ హిందీ రీమేక్‌లో నటిస్తోంది. ముంబయిలో ఈ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోగా షాహిద్​ కపూర్​ కూడా నటిస్తున్నారు. రాజ్​ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: సమంత పక్కా ప్లాన్​.. ఇకపై దానిపైనే ఫోకస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.