ETV Bharat / entertainment

స్టేజ్​పై కన్నీళ్లు పెట్టుకున్న ఆ స్టార్​ హీరో.. స్పందించిన సల్మాన్​ ఖాన్​

author img

By

Published : Dec 17, 2022, 5:08 PM IST

ఓ స్టార్ హీరో స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో వైరల్​ అవ్వగా.. దానిపై మరో అగ్రకథానాయకుడు సల్మాన్​ ఖాన్ స్పందించారు. ఏమన్నారంటే..

Salman Akshay kumar
స్టేజ్​పై కన్నీళ్లు పెట్టుకున్న ఆ స్టార్​ హీరో.. స్పందించిన సల్మాన్​ ఖాన్​

'రక్షాబంధన్‌' ప్రమోషన్‌ సమయంలో స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ స్టేజ్‌పై కన్నీరు పెట్టుకున్న ఓ వీడియోపై సల్మాన్‌ ఖాన్‌ తాజాగా స్పందించారు. సోషల్‌మీడియా వేదికగా ఈ వీడియో చూసిన ఆయన భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. ''ఇప్పుడే సోషల్‌మీడియాలో ఈ వీడియో చూశాను. దీనిని అందరితో పంచుకోవాలనిపించింది. దేవుడి దీవెనలు నీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నా అక్కీ. నిజంగానే నువ్వు గొప్ప వ్యక్తివి. ఈ వీడియో చూసి నేనూ ఎమోషనల్‌ అయ్యాను. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. మరెన్నో సినిమాల్లో నటించాలి'' అని సల్మాన్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. దీనిపై అక్షయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ''నీ సందేశం నా హృదయాన్ని తాకింది. నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా'' అని రిప్లై ఇచ్చారు.

చెల్లెళ్ల పెళ్లి చేయడం కోసం ఓ అన్నయ్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే ఆసక్తికర అంశాలతో 'రక్షాబంధన్‌' తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాఖీ రోజున అక్షయ్‌ ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆసమయంలోనే అక్షయ్‌ సోదరి పంపించిన ఓ ఎమోషనల్‌ సందేశాన్ని షోలో ప్రసారం చేశారు. ''నాన్న చనిపోయిన తర్వాత ఇంటిల్లిపాదిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. మాకోసం ఎంతో కష్టపడ్డావు. అన్నింటా అండగా నిలిచావు'' అంటూ ఆమె మాటలతో సాగిన ఈ వీడియో చూసిన ఆయన కళ్లల్లో నీరు తిరిగాయి. తాజాగా ఈ వీడియోను ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా.. దాన్ని చూసిన సల్మాన్‌ ఈ విధంగా స్పందించారు.

ఇదీ చూడండి: థియేటర్​లో సినిమా టికెట్లు అమ్మిన హీరోయిన్​.. ఎగబడ్డ కుర్రాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.