ETV Bharat / entertainment

Salaar Overseas Rights : సలార్ రికార్డ్ బిజినెస్​.. RRR తర్వాత ఇదే లార్జెస్ట్​ డీల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 11:13 AM IST

Salaar Overseas Rights : సలార్ రికార్డ్ బిజినెస్​.. RRR తర్వాత ఇదే లార్జెస్ట్​ డీల్​!.. ఎంతకు అమ్ముడుపోయిందంటే?
Salaar Overseas Rights : సలార్ రికార్డ్ బిజినెస్​.. RRR తర్వాత ఇదే లార్జెస్ట్​ డీల్​!.. ఎంతకు అమ్ముడుపోయిందంటే?

Salaar Overseas Rights : సలార్ సినిమా ఓవర్సీస్​లో రికార్డ్ బిజినెస్ చేసినట్లు తెలిసింది. ఆ వివరాలు..

Salaar Overseas Rights : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్​టైనర్ మూవీ 'సలార్‌' అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా రికార్డ్ రేంజ్​లో ఓవర్సీస్​ బిజినెస్​ చేసినట్లు సమాచారం అందింది.

గతంలో ఉత్తర అమెరికాలో ఆర్​ఆర్​ఆర్​ మూవీ రైట్స్ రూ.40కోట్ల వరకు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఓ తెలుగు సినిమాకు అక్కడ ఆ రేంజ్​లో బిజినెస్​ అవ్వడం అదే మొదటి సారి. ఇప్పుడు సలార్​ దాదాపుగా ఆ నెంబర్​కు దగ్గరగా వెళ్లింది. 4.5 మిలియన్ డాలర్లు. అంటే రూ.37 కోట్లకు అమ్ముడుపోయిందని తెలిసింది. దీంతో నార్త్​ అమెరికాలో RRR​ తర్వాత సెకండ్ లార్జెస్ట్ డీల్​గా రికార్డుకెక్కింది. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే.. అన్నీ రకాల ఖర్చులు కలిపి​ సలార్ బ్రేక్ ఈవెన్​ టార్గెట్​ 9 నుంచి 10 మిలియన్ డాలర్స్​ ఉంటుంది.

అయితే ప్రభాస్.. బాహుబలి 2 తర్వాత మూడు చిత్రాల్లో నటించారు. అవి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఆ మూడు చిత్రాలు వేరు వేరుగా ఉత్తర అమెరికాలో ఫుల్​​ రన్ టైమ్​లో దాదాపు 3 మిలియన్​ డాలర్ల మార్క్​ను టచ్ చేశాయి. ఆదిపురుష్ 3.1 మిలియన్ డాలర్స్​, రాధేశ్యామ్​ 2.2 మిలియన్ డాలర్స్, సాహో 3.3 మిలియన్స్ డాలర్స్​ వరకు వసూళ్లను అందుకున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వీటిని పరిగణలోకి తీసుుకుంటే ప్రభాస్ ఈ సారి 10 మిలియన్ డాలర్స్​ మార్క్​ను టచ్ చేస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్​ మార్క్​.

Salaar New Release Date : అయితే ఈ చిత్రానికి కేజీయఫ్​ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గత చిత్రాలు కేజీయఫ్ సిరీస్​ భారీ విజయాన్ని నమోదు చేశాయి. కాబట్టి సలార్​ కూడా భారీ రేంజ్​లో విజయం సాధిస్తే.. ఏమైనా 10 మిలయన్ డాలర్స్ మార్క్​ను అందుకుంటుందా అనేది చూడాలి. ఇకపోతే ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్​పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది నవంబర్ అని కొంతమంది అంటున్నారు. లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతి లేదా ఇండిపెండెన్స్ డే రావొచ్చని చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Salaar Postponed : సలార్​.. ఈ ఏడాది మిస్సైతే.. ఇక 2024లో వచ్చేది అప్పుడే!

Salaar Postponed : 'సలార్' వాయిదాతో ఇతర చిత్రాల కొత్త రిలీజ్ డేట్స్​​ ఫిక్స్​.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.