ETV Bharat / entertainment

నైజాంలో 'ఆర్​ఆర్​ఆర్' ప్రభంజనం​.. తొలి సినిమాగా చరిత్ర

author img

By

Published : Apr 6, 2022, 10:31 AM IST

RRR movie NIzam record 100 crores collections
ఆర్​ఆర్​ఆర్ నైజాం కలెక్షన్స్​

RRR Nizam 100crore collections: ఎన్టీఆర్​, రామ్​చరణ్​ నటించిన 'ఆర్ఆర్​ఆర్' చిత్రం నైజాంలో రికార్డు స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది. రూ.100కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా ఘనత సాధించింది.

RRR Nizam 100crore collections: 'తొక్కుకుంటూపోవాలే', 'కుంభస్థలం బద్దలు కొడదాం పదా'.. హీరోలు ఎన్టీఆర్, రామ్​చరణ్​​ చెప్పిన ఈ డైలాగ్​లు​ సినీప్రియులందరికీ తెలిసే ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ హీరోలుగా.. మార్చి 25న విడుదలైన 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా కలెక్షన్ల విషయంలో ఇదే చేస్తోంది. బాక్సాఫీస్​ ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్​ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా నైజాంలో ఎవరూ ఊహించలేనంత స్థాయిలో రికార్డు వసూలు చేసి సరికొత్త బెంచ్​ మార్క్​ సెట్​ చేసింది. రూ.100 కోట్ల షేర్​ను అందుకుంది. నైజాంలో అంత మొత్తంలో కలెక్షన్లను కలెక్ట్​ చేసిన తొలి సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని సినీ జర్నలిస్టు బీఏ రాజు సోషల్​ మీడియా టీమ్​ ట్వీట్​ చేసింది.

యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌ , ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించారు.

RRR movie NIzam record 100 crores collections
ఆర్​ఆర్​ఆర్ నైజాం కలెక్షన్స్​

ఇదీ చూడండి: కలెక్షన్లలో ఏమాత్రం తగ్గని 'ఆర్ఆర్ఆర్'.. అన్నీ కుదిరితే సీక్వెల్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.