ETV Bharat / entertainment

'అందుకే రణ్​బీర్​ను కొట్టాను - ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 4:51 PM IST

Rashmika Mandanna Animal Movie : 'పుష్ప'తో పాన్ ఇండియా లెవెల్​లో పాపులరైన రష్మిక, 'యానిమల్'​ సినిమాతో మరోసారి సూపర్​ క్రేజ్​ సంపాదించుకుంది. ప్రస్తుతం 'పుష్ప 2' తోపాటు ధనుశ్​ సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

Rashmika Mandanna Animal Movie
Rashmika Mandanna Animal Movie

Rashmika Mandanna Animal Movie : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొంది సక్సెస్​ఫుల్ హీరోయిన్​గా దూసుకెళ్తోంది. 'ష్ప ది రైజ్‌' సినిమాతో శ్రీ వల్లిగా కనిపించి అభిమానులను అలరించిన ఈ స్టార్​, ఇటీవలే విడుదలైన 'యానిమల్‌' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు ధనుశ్​ మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'యానిమల్' మూవీ గురించి ముచ్చటించింది.

యానిమల్​లో ఆమె రణ్​బీర్​కు భార్యగా గీతాంజలి అనే పాత్రలో కనిపించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ సీన్ తర్వాత ఆమె ఏడ్చినట్లు చెప్పుకొచ్చింది. రణ్​బీర్​ను కొట్టి కేకలు పెట్టానంటూ వెల్లడించింది.

"యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ను కొట్టే సీన్​ నాకో సవాల్​గా అనిపించింది. సింగిల్​ టేక్​లోనే ఆ సీన్​ను షూట్‌ చేశాం. డైరెక్టర్​ సందీప్‌ సీన్‌ను వివరించారు. పరిస్థితిని ఫీలవ్వాలంటూ చెప్పారు. నాకు ఆ ఒక్క మాట మాత్రమే గుర్తుంది. అంతే యాక్షన్‌, కట్‌ మధ్యలో ఏం జరిగిందో ఇంకేం గుర్తు లేదు. రణ్‌బీర్​ను అరిచాను. కోపంతో అతడ్ని చెంపపై కొట్టాను. అయితే షాట్‌ ఓకే అని డైరెక్టర్​ చెప్పినా కూడా నాకు కన్నీళ్లు ఆగలేదు. బాగా ఏడ్చేశాను. ఆ తర్వాత రణ్‌బీర్‌ దగ్గరికి వెళ్లి 'అంతా ఓకేనా' అని అడిగాను." అంటూ ఆ రోజు జరిగిన ఘటనను గుర్తు చేసుకుంది.

మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి కూడా అప్​డేట్ ఇచ్చింది రష్మిక. ఈ సినిమా ఊహించిన దానికంటే భారీ స్థాయిలో ఉంటుందని తెలిపింది. "పుష్ప 2 గురించి నేను ఒకే ఒక్క మాట చెప్పగలను. ఈ సినిమా మీరు ఊహించిన దానికంటే ఓ రేంజ్​లో ఉండనుంది. పుష్ప ది రైజ్‌ సక్సెస్‌తో మాపై బాధ్యత మరింత పెరిగింది. ఇటీవలే నేను ఓ పాట షూట్‌లో పాల్గొన్నా. ఇది ముగింపు లేని కథ. మనం అనుకున్నట్లు ఈ సిినిమాను తీర్చిదిద్దవచ్చు. ఈ చిత్రం విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఇందులో నా పాత్ర చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక దీంతో పాటు శేఖర్‌ కమ్ముల - ధనుష్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను" అంటూ తన లేటెస్ట్ మూవీ అప్డేట్స్​ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రష్మిక 'క్రష్​ క్లబ్'​లో చేరిన ఆలియా భట్- 'యానిమల్' హీరోయిన్ రియాక్షన్ ఏంటో తెలుసా?

రష్మిక బ్యూటీ సీక్రెట్- హ్యాండ్ బ్యాగ్​లో అది పక్కాగా ఉండాల్సిందేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.