ETV Bharat / entertainment

ఆ కన్నడ డైరెక్టర్​కు చరణ్​ గ్రీన్​ సిగ్నల్​.. ఆ రోజే అనౌన్స్​మెంట్​!

author img

By

Published : Feb 8, 2023, 5:49 PM IST

Updated : Feb 8, 2023, 6:35 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. 'ఆర్​ సీ17' త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. ఆ వివరాలు..

Etv Bharatram-charan-17th-movie-directed-by-northan
నార్థన్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త సినిమా

కన్నడ దర్శకుడు నార్తన్​-మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్ కాంబినేషన్​లో ఓ సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇన్నాళ్లకీ వారిద్దరి మధ్య చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. నార్తన్​ దర్శకత్వంలోనే రామ్ చరణ్ కొత్త మూవీ త్వరలో సెట్స్​పైకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రామ్​ చరణ్​ పుట్టిన రోజు మార్చి 27వ తేదిన ఈ సినిమాపై పుల్​ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆర్​ఆర్​ఆర్ సినిమాతో మంచి సక్సెస్​ను అందుకున్న చరణ్​.. ఆ తర్వాత తన తండ్రి చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. దీంతో తన కొత్త చిత్రాలను చాలా జాగ్రత్తగా ప్లాన్​ చేసుకుంటున్నారు చరణ్​. ఈ క్రమంలోనే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్​ సీ15 సినిమా చిత్రీకరణలో పుల్ బిజీగా ఉన్న ఆయన.. మరో వైపు కథలపై కూడా పూర్తి దృష్టి పెట్టారు. అలా ఇప్పటికే ఆర్​ సీ16గా బుచ్చిబాబుతో ఓ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు అవుతున్నాయి. త్వరలోనే సెక్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది.

దీని తర్వాత నార్తన్​ దర్శకత్వంలో ఆర్​ సీ 17 రూపొందనుంది. అలా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్​ చరణ్​ బర్త్​ డేన వచ్చే అవకాశముంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Last Updated : Feb 8, 2023, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.