ETV Bharat / entertainment

సుక్కూ నయా స్కెచ్​.. రష్యాలో 'పుష్ప' రిలీజ్​.. ఓటీటీలో 'మాచర్ల నియోజకవర్గం'

author img

By

Published : Nov 26, 2022, 8:16 AM IST

'పుష్ప' చిత్రంతో సూపర్​హిట్​ అందుకున్నారు ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్‌. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే నెల్లో రష్యాలో విడుదల చేస్తున్నారు. అందుకోసం బన్నీ రష్యాకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, నితిన్‌ హీరోగా తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' ఓటీటీలోకి రానుంది.

Pushpa In OTT
Pushpa In OTT

Pushpa Release In Russia : 'పుష్ప' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు హిందీలోనూ సత్తా చాటింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాని వచ్చే నెల్లో రష్యాలో విడుదల చేస్తున్నారు. అందుకోసం బన్నీ రష్యాకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని చూసి అక్కడివారు ఎలా స్పందిస్తారో చూడాలని అల్లు అర్జున్‌ రష్యాకి వెళుతున్నారట. మరో పక్క 'పుష్ప 2' చిత్రీకరణతోనూ బిజీగా ఉన్నారాయన. తొలి చిత్రాన్ని మించిన భారీ హంగులతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఓటీటీలో సందడి చేయనున్న మాచర్ల నియోజకవర్గం...
Macherla Niyojakavargam : నితిన్‌ హీరోగా తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఈ ఆగస్టులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ శుక్రవారం ఖరారైంది. 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ అందుకున్న కథానాయకుడు రాక్షస రాజ్యాన్ని తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెరకెక్కించారు. నితిన్‌ సరసన కృతిశెట్టి, కేథరిన్‌ నటించారు. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం ఓటీటీ విడుదల ఆలస్యమే.

ఉచితంగా..
'కింగ్‌ ఆఫ్‌ సర్పెంట్‌' అనే చైనీస్‌ సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఉచితంగా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. "మనుషుల ప్రాణాలను తీసే భయంకర సర్పం. క్షణక్షణం ఉత్కంఠ భరితం. ఈ రోజే చూసేయండి" అంటూ ఓ పోస్ట్‌ పెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.