ప్రభాస్​తో పెళ్లి.. ఎట్టకేలకు నిజం ఒప్పేసుకుందిగా కృతిసనన్​!

author img

By

Published : Nov 25, 2022, 7:00 PM IST

Prabhas Kritisanon marriage

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​పై షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ కృతిసనన్​. ఇప్పటికే ఆయనతో ఈ భామ చాలా క్లోజ్​గా మూవ్​ అవుతోందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా డార్లింగ్​ను పెళ్లి చేసుకోవాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది.

టాలీవుడ్​లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు హీరో ప్రభాస్. ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అటు అభిమానులు ఇటు సినీ సెలబ్రిటీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే డార్లింగ్​ రిలేషన్​షిప్​లో ఉన్నాడంటూ పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో హీరోయిన్ కృతిసనన్ ఓకరు. అయితే తాజాగా ఈ ప్రచారానికి కృతి ఇంకాస్త మసాలా యాడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

'ఆదిపురుష్' షూటింగ్ సమయంలో హీరోయిన్ కృతిసనన్.. హీరో ప్రభాస్ దగ్గరయ్యారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. గతంలో 'కాఫీ విత్ కరణ్' షోకి వచ్చిన కృతి.. ప్రభాస్​కు ఫోన్ చేసి ఫ్యాన్స్​కు షాక్ ఇచ్చింది. అలానే 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ ఈవెంట్​లోనూ ప్రభాస్-కృతిసనన్ జోడీ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. ఆ వీడియోలు, ఫొటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి.

ఇక తాజాగా భేడియా(తెలుగులో తోడేలు) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కృతి.. ప్రమోషన్స్​లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ప్రభాస్​ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్, ఎవరితో డేట్ చేస్తావ్ అని యాంకర్ మూడు ఆప్షన్స్​ ఇవ్వగా.. కార్తీక్ ఆర్యన్​తో ఫ్లర్టింగ్, టైగర్ ష్రాఫ్​తో డేటింగ్ అని చెప్పి, ఛాన్స్ వస్తే ప్రభాస్​ను పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నార్త్ వదిన కన్ఫర్మ్ అయిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.