ETV Bharat / entertainment

Adipurush Tribeca Festival : 'ఆదిపురుష్'​కు అరుదైన గౌరవం..న్యూయార్క్ వే​డుకల్లో ప్రదర్శన

author img

By

Published : Apr 19, 2023, 8:59 AM IST

Updated : Apr 19, 2023, 12:39 PM IST

adipurush
adipurush

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన మైథాలజికల్ మూవీ 'ఆదిపురుష్'​కు ఓ అరుదైన గౌరవవం దక్కింది. న్యూయార్క్​ వేదికగా జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమవ్వనుంది.

రెబల్​ స్టార్​ ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'​. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక 'ట్రిబెకా ఫెస్టివల్‌'లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా దర్శకుడు ఓం రౌత్‌ తెలియజేశారు.

"ఇది గౌరవం, సంతోషానికంటే మించింది. 2023 జూన్‌ 13న 'ఆదిపురుష్' న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ని. ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని ఓం రౌత్‌ తెలిపారు. ఇక ఈ వేడుక జూన్‌ 7 నుంచి 18 వరకు న్యూయార్క్​లో అట్టహాసంగా జరగనుంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవెల్​లో భారీ బడ్జెట్‌తో త్రీడీలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రామునిగా నటించారు. జానకి పాత్రలో కృతి సనన్‌, లంకేశునిగా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే కనిపించనున్నారు. అయితే ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్‌ పనుల కారణంగా వాయిదా పడింది. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది జూన్‌ 16న థియేటర్లలో రిలీజవ్వనుంది.

రన్​టైమ్​పై క్లారిటీ..
జూన్​లో రిలీజవ్వనున్న ఈ సినిమా రన్​టైమ్​ గురించి నెట్టింట్లో తెగ చర్చలు జరిగింది. అయితే ట్రిబెకా అఫీషయల్ వెబ్‌సైట్‌ ద్వారా 'ఆదిపురుష్​' రన్‌టైమ్‌‌ విషయంపై పై ఓ క్లారిటీ వచ్చింది. దీని ప్రకారం సినిమా నిడివి 174 నిమిషాలు ఉంటుందని తెలిసింది. అంటే సుమారు 2 గంటల 54 నిమిషాలు. గతంలో ఈ సినిమా రన్‌టైమ్‌పై ఎన్నో రూమర్స్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొదట్లో ఈ టైమ్​ను 3 గంటల 16 నిమిషాలకు ఫిక్స్ చేశారని టాక్ కూడా నడిచింది.

వివాదాలు, విమర్శలు..
గతేడాది దసరాకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టీజర్​ను చూసిన అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్‌ లేదని.. రావణాసురుడు, హనుమంతుడి లుక్స్​తో పాటు వీఎఫ్‌ఎక్స్‌ బాగోలేదని అంటూ నెట్టింట విమర్శలు గుప్పించారు. 'ఆదిపురుష్' సినిమా మొత్తం యానిమేషన్​లా ఉందని ట్రోల్​ చేశారు. ముఖ్యంగా రావణుడి, ఆంజనేయుడి పాత్రలను వక్రీకరించినట్లు సోషల్​ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తోలు వస్తువులు ఉపయోగించినట్లు ఆరోపించారు. అంతే కాకుండా, ఈ సినిమాకు అప్పట్లో బాయ్​కాట్​ సెగ కూడా తాకింది. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.

Last Updated :Apr 19, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.