ETV Bharat / entertainment

విజయ్‌ కొత్త సినిమా అప్డేట్​.. ప్రముఖ నిర్మాణ సంస్థ 100వ ప్రాజెక్టుగా

author img

By

Published : Sep 12, 2022, 4:40 PM IST

vijay Thalapathy new movie update: తమిళ హీరో విజయ్​ నటించనున్న కొత్త సినిమా అప్డేట్​ వచ్చేసింది. ఇంతకీ ఆయన ఏ చిత్రం చేయనున్నారంటే..

vijay new movie update
విజయ్​ కొత్త సినిమా అప్డేట్​

vijay Thalapathy new movie update: 'వారిసు'(వారసుడు) చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు కోలీవుడ్​ స్టార్​ హీరో దళపతి విజయ్‌. ఇది పూర్తికాకముందే ఆయన తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్​ బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ 100వ చిత్రంలో విజయ్‌ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధినేత ఆర్‌. బి. చౌదరి తనయుడు, నటుడు జీవా మీడియా సమావేశంలో తెలిపారు.

తన తండ్రిని విజయ్‌ కొన్ని రోజుల క్రితం కలిసి, తమ నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా నిలవనున్న 100వ సినిమాలో హీరోగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని జీవా వెల్లడించారు. తనకూ సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలని, రెమ్యూనరేషన్‌ తీసుకోనని తన తండ్రికి చెప్పినట్టు వివరించారు (నవ్వుతూ..). ఈ ఇద్దరు కలిసి గతంలో 'నన్‌బన్‌' (స్నేహితుడు) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మరి, ఈ కొత్త చిత్రానికి దర్శకుడెవరు? వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

విజయ్‌ నటిస్తున్న 'వారిసు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో శరత్‌కుమార్‌, ప్రభు, ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ, శ్యామ్‌, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అక్టోబరు చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇది విజయ్‌కి 66వ #Thalapathy66 చిత్రం. తదుపరి చిత్రం 'మాస్టర్‌', 'విక్రమ్‌' చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో ఉంటుందనే వార్తలొచ్చాయి. మరోవైపు, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, అట్లీ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తారని ఊహాగానాలు వినిపించాయి. 'సుస్వాగతం', 'సూర్యవంశం', 'రాజా', 'సంక్రాంతి', 'గోరింటాకు', 'అందాల రాముడు' 'నవ వసంతం' తదితర చిత్రాలు సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో వచ్చినవే.

ఇదీ చూడండి: చిన్నారి అభిమానికి రజనీకాంత్​ సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.