ETV Bharat / entertainment

ఇక్కడ పవన్​ కల్యాణ్​.. అక్కడ వరుణ్​ ధావన్​.. నిజమెంతో?

author img

By

Published : May 17, 2023, 10:30 AM IST

ఇండస్ట్రీలో రీమేక్​ హవా కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తెలుగులో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ చేయబోయే ఓ రీమేక్​ను బాలీవుడ్​లో యంగ్ హీరో వరుణ్​ ధావన్​ చేయబోతున్నారట. ఆ వివరాలు..

Vijay Thalapathy Teri remake
ఇక్కడ పవన్​ కల్యాణ్​.. అక్కడ వరుణ్​ ధావన్​.. నిజమెంతో?

ఇండస్ట్రీలో రీమేక్​ల ట్రెండ్​ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఓ భాషలో సినిమా హిట్ అవ్వగానే దాని ఇతర భాషలో తెరకెక్కించేస్తున్నారు. టాలీవుడ్​లో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటిస్తున్న సినిమాల్లో ఒకటైన 'ఉస్తాద్​ భగత్ సింగ్'​ కూడా.. 2016లో తమిళ హిట్​గా నిలిచిన విజయ్ దళపతి 'తేరి' రీమ్​క్​ అని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై మూవీటీమ్​ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ చిత్రం మాత్రం రీమేక్​ అని ఇండస్ట్రీ ఇన్​సైడ్​ టాక్​. దర్శకుడు హరీశ్ శంకర్​.. ఒరిజినల్​ వెర్షన్​తో సంబంధం లేకుండా వీలైనంత వరకు మార్పులు చేసి దీన్ని రూపొందిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే రిలీజైన స్పెషల్ గ్లింప్స్​కు కూడా మంచి స్పందనే వచ్చింది. అయితే ఇప్పుడీ 'తేరి' చిత్రాన్నే హిందీలో కూడా రీమేక్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మాతృకకు దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్​ అట్లీనే దీన్ని హిందీలో చేయబోతున్నారట.

మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా.. దర్శకుడు అట్లీ.. హిందీలో తన రెండో ప్రాజెక్టు కోసం శ్రీకారం చుట్టారని సమాచారం అందింది. ఇప్పటికే బాలీవుడ్​ బాద్​షా షారుక్‌తో 'జవాన్‌' రూపొందిస్తున్న ఆయన.. యంగ్ హీరో వరుణ్‌ ధావన్​తో కలిసి ఇంకో చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మురాద్‌ ఖేతానీ నిర్మించనున్నారట. యాక్షన్‌ ఎంటర్‌టైనర్​గా ఈ సినిమా రూపొందుతందని.. ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి. 2024 సమ్మర్​లో ఆడియెన్స్​ ముందుకు తీసుకొస్తారని పేర్కొన్నాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా విజయ్​ 'తేరి'కి హిందీ రీమేక్​ అని టాక్​ వినిపిస్తోంది. ఈ కథను తెలుగులో మర్పులు చేసి తీస్తున్నట్లుగా కాకుండా.. ఉన్నది ఉన్నట్టుగా తీసేందుకే అట్లీ మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే ‘మురాద్‌ ఖేతానీ, అట్లీ, వరుణ్‌ మధ్య చర్చలు కూడా పూర్తయిపోయాయట. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ పనుల్లో ఉందట. మరి ఇందులో ఏది నిజమో తెలీదు కానీ.. సినీ ప్రియులు మాత్రం ఇక్కడ పవన్ కల్యాణ్​ అక్కడ వరుణ్​ తేజ్​ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఫ్రీమేక్​.. అసలు ఈ 'తేరి' ఓ పాత చిత్రానికి ఫ్రీ మేక్! 1990లో సీనియర్​ హీరో విజయ్ కాంత్ నటించిన 'క్షత్రియుడు' సినిమా వచ్చింది. ఆ కథ స్ఫూర్తితోనే దర్శకుడు అట్లీ 'తేరి' కథ రాశారని అంటుంటారు. ఇప్పుడదే కథను అన్ని భాషల్లోనూ రీమేక్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: మలయాళీ సినిమా రికార్డ్​.. రూ.15కోట్ల బడ్జెట్​.. పది రోజుల్లోనే రూ.100కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.