ETV Bharat / entertainment

'ఉస్తాద్' యూటర్న్​.. మహేశ్​ 'గుంటూరు కారం'తో పోటీకి రెడీ!

author img

By

Published : Aug 2, 2023, 8:44 PM IST

2024 Tollywood sankranthi movies : పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​ యూటర్న్​ తీసుకున్నట్లు తెలిసింది. సూపర్ స్టార్ మహేశ్​బాబుతో పోటీ పడనున్నట్లు సమాచారం అందింది. ఆ వివరాలు..

ustaad bhagat singh
'ఉస్తాద్' యూటర్న్​.. మహేశ్​ 'గుంటూరు కారం'తో పోటీకి రెడీ!

pawan kalyan ustaad bhagat singh : వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్ రసవత్తరంగా మారబోతుంది. సడెన్​గా ఓ బడా స్టార్ హీరో సినిమా ఈ రేసులోకి దిగబోతుందని సమాచారం అందింది. అది మరెవరో కాదు పవన్ కల్యాణ్​ 'ఉస్తాద్ భగత్ సింగ్'. అదేంటి.. ఈ చిత్రం ఆగిపోయింది కదా అంటారా? అదే ట్విస్ట్ ఇక్కడ. ఆ సినిమా మూవీటీమ్ తమ నిర్ణయంలో యూటర్న్​ తీసుకున్నట్లు తెలిసింది.

వాస్తవానికి పవన్ రాజకీయ ప్రచార సభలతో బిజీ అవ్వడంతో.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ ఆగిపోయిందని, సినిమాను ఏపీ ఎలెక్షన్స్ తర్వాతకు పోస్ట్ పోన్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు.. ఎన్నికల కన్నా ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. దర్శకుడు హరీశ్​కు కూడా సినిమా పూర్తి చేస్తానని పవన్ మాటిచ్చారని అంతా అంటున్నారు.

రీసెంట్​గా ఇద్దరు కలిసి చర్చలు జరిపారని తెలిసింది. అయితే పవన్ ఓ కండిషన్ పెట్టారట. 30 రోజుల్లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలని చెప్పారట. దీనికి హరీశ్ కూడా ఒప్పుకున్నారట. అలా ఇద్దరు కలిసి ఈ ఏడాదే సినిమా షూటింగ్​ను ఎలాగైనా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ చేశారట.

2024 Tollywood sankranthi movies : ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరో విషయమేమిటంటే.. అనుకున్నట్టే 'ఉస్తాద్'​ సంక్రాంతి బరిలోకి దిగితే..బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే ఈ రేసులో సూపర్ స్టార్ మహేశ్​బాబు కూడా ఉన్నారు. గుంటూరు కారం ఈ పండక్కే రిలీజ్​ అయ్యేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​లో రవితేజ 'ఈగల్' కూడా ఈ ముగ్గుల పండక్కే రానుంది. ఇంకా వైవిధ్య కథల దర్శకుడు ప్రశాంత్‌ వర్మ-తేజా సజ్జా కాంబోలో రూపొందిన 'హనుమాన్' కూడా ఈ పండక్కే సందడి చేయనుంది.

ఇదీ చూడండి :

Gunturu Karam Shooting : మహేశ్​ తిరిగొచ్చేస్తున్నాడహో.. ఆ రోజు నుంచే షూటింగ్ షురూ..

'ఉస్తాద్'​.. గబ్బర్​ సింగ్​ సీక్వెలా ?.. అసలు ఈ 'కాప్​ కనెక్ట్'​ ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.