ETV Bharat / entertainment

ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌.. ఊహించని రేంజ్​లో కొత్త ప్రాజెక్ట్​

author img

By

Published : Feb 15, 2023, 6:23 PM IST

ఎన్టీఆర్​ త్రివిక్రమ్​ కాంబోలో ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్​ ఎవరూ ఊహించని రేంజ్​లో ఉండబోతుందని అర్థమవుతోంది. ఆ సంగతులు..

NTR Trivikram
ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌.. ఊహించని రేంజ్​లో కొత్త ప్రాజెక్ట్​

'అర‌వింద స‌మేత వీర రాఘ‌వ' త‌ర్వాత హీరో ఎన్టీఆర్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కాంబినేషన్​లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు చాలా కాలం క్రితం ప్ర‌చారం సాగిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత అది వినపడలేదు. తాజాగా ఈ కాంబో గురించి మళ్లీ ఇంట్రెస్టింగ్​ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో పౌరాణిక క‌థాంశంతో ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. అసలే త్రివిక్రమ్ సినిమాలోని డైలాగ్​లకు, పంచ్‌ లైన్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. ఇక ఎన్టీఆర్​ విషయానికొస్తే.. డైలాగ్‌ను చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. మరి వీరిద్దరి కాంబోలో పౌరాణిక సినిమా వస్తే మాములుగా ఉండదు.

అయితే ఈ విషయాన్ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగవంశీ చెప్పినట్లు సోషల్​మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాగవంశీ మాట్లాడుతూ.. "త్రివిక్రమ్‌ త్వరలోనే తారక్‌తో ఓ పౌరాణిక సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో దీనిని తెరకెక్కించనున్నారు" అని ఆయన చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, వార్త మాత్రం వైరల్‌ అవుతోంది.

ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్‌ స్టార్‌ హీరో మహేశ్‌ బాబుతో SSMB28 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ కూడా వరస చిత్రాలను ప్రకటిస్తున్నారు. త్వరలోనే NTR30 సెట్స్‌ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి 24 నుంచి మొదలుకానుంది. దీనితో పాటు ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ ఓ సినిమా చేయనున్నారు.

ఇదీ చూడండి: పుష్ప 2, RC 15, ఇండియన్​ 2.. ఇప్పుడన్నీ ఆఫర్స్ అతడికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.