ETV Bharat / entertainment

'ఎన్టీఆర్​ 30' మరింత ఆలస్యం.. కారణమిదే..

author img

By

Published : Feb 20, 2023, 5:58 PM IST

Updated : Feb 20, 2023, 6:03 PM IST

NTR 30 Movie Date Postponed
ఎన్టీఆర్​ 30 మూవీ తేదీ వాయిదా

జూనియర్​ ఎన్టీఆర్​, కొరటాల శివ కాంబోలో రానున్న 'ఎన్టీఆర్ ​30' మూవీ సెట్స్​పైకి వెళ్లేందుకు కాస్త సమయం పట్టనుంది. ఈ నెల 24న దీనికి క్లాప్​ కొట్టాల్సి ఉండగా.. తారకరత్న మరణంతో ఈ షెడ్యూల్​ను పోస్ట్​పోన్​ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

కొరటాల శివ-ఎన్టీఆర్​ కాంబినేషన్​లో NTR 30 సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్​ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 24న ఫిక్స్​ చేసినట్లు గతంలో మూవీటీమ్​ ప్రకటించింది. అయితే ఇప్పుడీ ప్రారంభోత్సవ తేదీలో మార్పులు జరిగాయి. సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా నందమూరి తారకరత్న మృతితో ఆ ఇంట్లో విషాధ ఛాయలు అలుముకోవటం వల్ల ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సినిమా యూనిట్​ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

కాగా, జనతా గ్యారేజ్​ తర్వాత.. కొరటాల శివ, ఎన్టీఆర్​తో కలిసి ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సినమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయినప్పటికీ అప్డేట్స్​ మాత్రం ఇవ్వలేదు. కనీసం సెట్స్​పైకి కూడా చిత్రాన్ని తీసుకెళ్లలేదు. అయితే ఇటీవల విడుదల అయిన కల్యాణ్​రామ్​ నటించిన అమిగోస్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో 'ఎన్టీఆర్​ 30' మూవీకి సంబంధించి తారక్​ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న షూటింగ్​ ప్రారంభోత్సవ వేడుక జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 24న సినిమాకి క్లాప్​, మార్చిలో షూటింగ్​ ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిలో దీనిని రిలీజ్​ చేసేందుకు షెడ్యుల్​ ఖరారు చేసినట్లు వెల్లడించారు. అయితే తాజాగా తన సొదరుడి మృతితో బాధలోకి వెళ్లిపోయారు ఎన్టీఆర్. దీంతో ఆయన​ కాస్త కుదుట పడ్డాక కొత్త తేదీని ప్రకటిస్తామని తాజాగా సినిమా యూనిట్​ ట్వీట్​ చేసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ తెరంగేట్రం చేయనుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాగా, 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ కొన్ని సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ వాటికి సంబంధించిన పనులు కూడా ఇంకా మొదలవ్వలేదు.

Last Updated :Feb 20, 2023, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.