ETV Bharat / entertainment

ఆ స్టార్​ హీరోయిన్​తో చైతూ రిలేషన్!​.. ఫొటో వైరల్​.. సమంత ఫ్యాన్స్​ సీరియస్​

author img

By

Published : Nov 25, 2022, 12:32 PM IST

టాలీవుడ్​ స్వీట్​ కపుల్​ చై-సామ్​ విడిపోయాక వారిద్దరి గురించి ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు సామ్​ రిలేషన్ గురించి రూమర్స్​ చెలరేగుతున్న సమయంలో చైతూకు సంబంధించిన ఓ ఫొటో వైరల్​గా మారింది.

naga-chaitanya-said-to-be-dating-major-actress-sobhita-dhulipala
naga-chaitanya-said-to-be-dating-major-actress-sobhita-dhulipala

Naga Chaitanya Shobitha Photo: టాలీవుడ్​ స్టార్​ జంట నాగచైతన్య సమంత​ విడిపోయిన తర్వాత వారి కొత్త రిలేషన్​ గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అప్పట్లో సామ్​ ఓ మోడల్​తో ప్రేమలో పడ్డట్లు వచ్చిన వార్తల తరహాలోనే చైతూపై ఓ రూమర్​ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. 'మేడిన్‌ హెవెన్‌' వెబ్‌సిరీస్‌తో పాపులర్​ అయిన ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య రిలేషన్​లో ఉన్నారు అని పలుమార్లు నెట్టింట చర్చలు జరిగాయి. అయితే వీటిని నిజం చేసేలా ఉన్న ఓ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

naga-chaitanya-said-to-be-dating-major-actress-sobhita-dhulipala
వైరలవుతున్న చైతన్య శోభిత ఫొటో

లండన్​ స్ట్రీట్స్​లో దిగినట్లు కనిపిస్తున్న ఆ ఫొటో గురించి ఒకొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ ఇద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెబుతుండగా.. చైతూ స్పెషల్‌గా తన బర్త్‌డే జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు మరికొందరు అంటున్నారు. అయితే ఈ ఫొటో చూస్తుంటే.. ఇద్దరూ ఏదో క్యాజువల్‌గా కెమెరాకు పోజులిచ్చారు తప్ప.. తమ మధ్య ఏమీ లేదని చెబుతున్నట్లుగా ఉందని మరికొంతమంది అంటున్నారు.

ఈ రూమర్స్​ అన్నింటిని నాగచైతన్య టీమ్ ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని ఎవరో కావాలని చేస్తున్న ప్రచారమని స్పష్టత ఇచ్చారు. శోభిత సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అదంతా ట్రాష్ అంటూ కొట్టిపడేశారు. ఈలోపు సమంత ఫ్యాన్స్​ కూడా సీరియస్​ అవుతు్నారు.
అయితే ఈ ఫొటోను నిశితంగా పరిశీలించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటున్నారు. వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య, శోభిత ఫొటోలు మార్ఫింగ్ చేశారని ట్వీట్​ చేస్తున్నారు.

naga-chaitanya-said-to-be-dating-major-actress-sobhita-dhulipala
మార్ఫింగ్ చేసిన ఫొటో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.