ETV Bharat / entertainment

గతంలో క్యాన్సర్​ బారినపడ్డ చిరంజీవి?.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్​!

author img

By

Published : Jun 3, 2023, 6:18 PM IST

Updated : Jun 3, 2023, 7:25 PM IST

megastar chiranjeevi on his healthmegastar chiranjeevi on his health
megastar chiranjeevi on his health

తాను క్యాన్సర్‌ బారినపడినట్లు వచ్చిన వార్తలపై అగ్రకథానాయకుడు మెగాస్టార్​ చిరంజీవి స్పందించారు. తనకు ఎటువంటి ప్రాబ్లమ్​ లేదని ట్విట్టర్​ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

గతంలో తాను క్యాన్సర్‌ బారినపడినట్లు వచ్చిన వార్తలపై అగ్రకథానాయకుడు మెగాస్టార్​ చిరంజీవి స్పందించారు. తనకు ఎటువంటి ప్రాబ్లమ్​ లేదని ట్విట్టర్​ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
"కొద్దిసేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్​ను ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్​గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్​ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్​గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నానని చెప్పాను. అందులో non - cancerous polypsను డిటెక్ట్ చేసి తీసేశారు అని తెలిపాను. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమోనని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు/స్క్రీనింగ్ చేయించుకోవాలని మాత్రమే చెప్పాను. అయితే నేను క్యాన్సర్ బారినపడ్డట్లు వార్తలు వచ్చాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్​లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్" అంటూ చిరు చెప్పుకొచ్చారు.

  • కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…

    — Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chiranjeevi About Cancer : హైదరాబాద్​లోని నానక్‌రామ్‌గూడలోని స్టార్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించిన ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తన అభిమానులతో పాటు సినీ కార్మికులకు క్యాన్సర్​పై అహగాహన కల్పించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని చెప్పారు. "అభిమానులు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తాను. అభిమానుల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చుచేస్తా. హైదరాబాద్​తో పాటు వివిధ జిల్లాల్లోనూ ఈ స్క్రీనింగ్‌ టెస్టులు జరిగేలా చూసుకుంటాను. ఈ టెస్ట్​ల కోసం స్టార్ హాస్పిటల్‌తో మాట్లాడాను. జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్‌ గుర్తించవచ్చు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తా. త్వరలోనే హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్ కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన అన్నారు.

Chiranjeevi Movies List : ఇక మెగాస్టార్​ లైనప్​ విషయానికి వస్తే.. 'గాడ్ ఫాదర్​' సినిమా తర్వాత.. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్​ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా కథానాయిక. చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళంలో బ్లాక్​బస్టర్ విజయం సాధించిన అజిత్​ 'వేదాళం' చిత్రానికి తెలుగు రీమేక్​గా 'భోళా శంకర్' రూపొందుతోంది.

Chiranjeevi Bholashankar : 'భోళా శంకర్'​ కథ విషయానికి వస్తే.. అన్నాచెల్లెళ్ల అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. డైరెక్టర్​ మెహర్​ రమేశ్​ కథలో స్వల్ప మార్పులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. లేటెస్ట్​ పోస్టర్ల ఆధారంగా చిరు ఈ సినిమాలో మాస్​, స్టైలిష్​ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Last Updated :Jun 3, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.