ETV Bharat / entertainment

చిరంజీవి డైరెక్ట్ చేసిన ఆ మూడు సీన్లు​ తెలుసా?

author img

By

Published : May 24, 2023, 7:49 PM IST

తన యాక్టింగ్​తో ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్​ చిరంజీవి.. డైరెక్షన్​​ చేశారని మీకు తెలుసా? ఆ వివరాలు..

Chiranjeevi directed scenes
చిరంజీవి డైరెక్ట్ చేసిన ఆ మూడు సీన్లు​ తెలుసా?

మెగాస్టార్​ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఏ బ్యాక్​గ్రౌండ్​ లేకుండా మధ్య తరగతి కుటుంబం నుంచి కొణిదెల శివశంకర వర ప్రసాద్​గా చిత్రపరిశ్రమకు వచ్చిన ఆయన.. తన నటనతో మెగాస్టార్​గా ఎదిగారు. స్వయంకృష్టితో ఎదిగిన ఆయన.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లోకి రావాలనుకునే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఎన్నో చిత్రాల్లో నటించిన చిరు.. డైరెక్ట్ కూడా చేశారని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. కాకపోతే పూర్తిస్థాయిలో కాదు. ఈ విషయాన్ని సీనియర్ నటుడు తనికెళ్ల భరణి చెప్పారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మధ్య వరుస వీడియోలు పోస్ట్​ చేస్తున్నారు తనికెళ్ల భరణి. సినీ ప్రముఖుల గురించి ఆసక్తికర విషయాలు, వారితో తనకున్న అనుబంధాన్ని తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో చిరంజీవిని ప్రశంసిస్తూ ఓ కవిత కూడా చెప్పారు.

"చిరంజీవి.. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎవరి అండా లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారు. ఆయన ఎంతో మంది స్ఫూర్తి. చిరంజీవిని మా గురువు రాళ్లపల్లి గారు మొదట పరిచయం చేశారు. 'కుక్కకాటుకి చెప్పు దెబ్బ' అనే సినిమా షూటింగ్ సమయంలో నాకు చిరును పరిచయం చేశారు. అదే నేను తొలిసారి చిరంజీవిని చూడటం. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించాం. అందులో ఓ సినిమా అనుభూతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చిరు గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు తనికెళ్ల భరణి.

బిగ్ బాస్ సినిమా షూటింగ్​ సమయంలో చిరు ఓ ఫైట్ సీన్ కంపోజ్ చేశా చెప్పారు తనికెళ్ల. "ఈ సినిమాకు విజయ్ బాపినీడు దర్శకుడు. నేను దుర్మార్గపు పోలీస్ పాత్ర పోషించాను. అయ్యప్ప మాలలో ఉన్న చిరంజీవిని అరెస్టు చేసేందుకు వెళ్లాలి. అయితే బాపినీడు తన ఫ్రెండ్‌కు బాలేదని వెళ్లిపోయారు. అయితే డేట్స్ లేని కారణంగా చిరునే రోజంతా మూడు సన్నివేశాలను షూట్ చేశారు. డైరెక్షన్​ను తన భుజాలకు ఎత్తుకున్నారు. హీరోగా ఉండి ఆయన టెక్నాలజీ నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం మంచి విషయం." అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్​లో ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ బిగ్​బాస్ సినిమా అప్పట్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇటీవలే 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో బాక్సాఫీస్​ వద్ద సూపర్​ హిట్​ను అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్' సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో తమన్నా హీరోయిన్​గా నటిస్తుండగా.. కీర్తిసురేశ్​ ఆయనకు చెల్లిలిగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఎన్టీఆర్​ వర్సెస్​ కృష్ణ.. రెండు రోజుల గ్యాప్​లో​ బ్లాక్​బాస్టర్​ మూవీస్ రీరిలీజ్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.