ETV Bharat / entertainment

ప్ర‌భాస్‌ X మ‌హేశ్​.. సంక్రాంతి బరిలోకి సూపర్​స్టార్!​.. ఆగస్టు​ 11 కష్టమేనా?

author img

By

Published : Mar 25, 2023, 9:57 AM IST

2024 సంక్రాంతి బరిలో టాలీవుడ్​ స్టార్​ హీరోలు ప్రభాస్​, రామ్​చరణ్​ ఉన్నారు. ఇప్పుడా ఆ జాబితాలోకి మహేశ్​ కూడా చేరబోతున్నారట. ఆ సంగతులు..

ssmb 28
ssmb 28

సంక్రాంతి పండుగకు టాలీవుడ్​లో సినిమాల సందడి మామూలుగా ఉండదు. బాక్సాఫీస్​ వద్ద పలువురి స్టార్​ హీరోల సినిమా అప్పుడే రిలీజ్​ అవుతుంటాయి. రోజుల వ్యవధిలో ప్రేక్షకుల మందుకు వచ్చి.. బాక్సాఫీస్​ వద్ద పోటీ పడుతుంటాయి. ఫలితాలతో సంబంధం లేకుండా.. వసూళ్లు వర్షం కురిపిస్తుంటాయి. అందుకే మేకర్స్​ కూడా సంక్రాంతికే విడుదల చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి బడా హీరోలు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలో విడుదలై మంచి వసూళ్లు సాధించాయి. మేకర్స్​కు లాభాలు తెచ్చిపెట్టాయి.

ఇకపోతే, వచ్చే ఏడాది సంక్రాంతి హడావుడి అప్పుడే మొదలైంది. స్టార్​ హీరోల సినిమాలు.. విడుదల తేదీలు ఖరారు చేసుకుంటున్నాయి. 2024 సంక్రాంతి బరిలో ఇప్పటికే పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​, గ్లోబల్​ స్టార్​ రామ్​చరణ్​ ఉన్నారు. ప్రభాస్​ నటిస్తున్న ప్రాజెక్ట్​-కె జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. శంకర్​ దర్శకత్వంలో రామ్​చరణ్​ నటిస్తున్న RC 15 కూడా సంక్రాంతికి రిలీజ్​ కానున్నట్లు సమాచారం. ఇప్పుడు వీరిద్దరితో సూపర్​స్టార్​ మహేశ్​ కూడా బాక్సాఫీస్​ వద్ద పోటీపబోతున్నారట.

మహేశ్​బాబు.. సర్కారుపాట తర్వాత నటిస్తున్న చిత్రం SSMB 28. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంద‌ని తొలుత ప్రకటించారు. కానీ పలు కారణాల రీత్యా సినిమా రిలీజ్​ వాయిదా ప‌డింది. ఆ తర్వాత ఆగస్టు 11ను రిలీజ్​ డేట్​గా ప్రకటించారు. కానీ ఇప్పుడు మీడియా వ‌ర్గాల్లో కొత్త టాక్​ వినిపిస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. అంటే ఈ ఏడాది మ‌హేశ్​ సినిమా లేన‌ట్లే. ఇది నిజంగా ఆయ‌న ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ‌ను క‌లిగించే అంశ‌మే! అయితే మంచి ఔట్‌పుట్ కావాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు అనేలా మేక్స‌ర్ ఈ సినిమాను రూపొందించాల‌నుకుంటున్నారట. అయితే సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో ముగ్గురు స్టార్ హీరోలు పోటీ ప‌డనున్నారంటూ సినీ పండితులు అంటున్నారు.

పవన్​ సినిమా వల్లే ఆలస్యమా?
అయితే మహేశ్​ చిత్రం.. పవన్​ సినిమా వల్లే ఆలస్యమవుతోందని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్​-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న తమిళ్​ రీమేక్​ వినోదయ సీతం జులై 28వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్న సినిమా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న సినిమాలు రెండు వారాల వ్యవధిలో విడుదల కావడం అనేది దాదాపుగా అసాధ్యం! అందుకే మహేశ్ బాబు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.