ETV Bharat / entertainment

బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​కు బెదిరింపులు.. చంపేస్తామని లేఖ

author img

By

Published : Jun 5, 2022, 7:45 PM IST

Updated : Jun 5, 2022, 8:12 PM IST

d
d

19:35 June 05

బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​కు బెదిరింపులు

బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ ఖాన్​ను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం బీటౌన్​లో కలకలం రేపింది. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనకు లేఖ రాశారు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సల్మాన్​ తండ్రి సలీమ్​ ఖాన్​... స్థానికంగా ఉన్న ఓ పార్కులో ఉదయం జాకింగ్​కు వెళ్లి అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఈ లేఖ వదిలి వెళ్లినట్లు తెలిపారు.

మీకు కూడా అదే గతి: దివంగత పంజాబ్​ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Last Updated :Jun 5, 2022, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.