ETV Bharat / entertainment

సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్

author img

By

Published : Oct 29, 2022, 11:08 AM IST

తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. తాజాగా ఈ స్టార్ నటుడు కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. తారక్​ కర్ణాటక ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

karnataka government invites jr ntr
karnataka government invites jr ntr

తన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తెలుగులో అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతూ అశేష అభిమానుల మనసులను గెలుచుకున్నారు. తారక్​.. కన్నడలోనూ జనాదరణ పొందారు. తాజాగా కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో తారక్​ కర్ణాటక ప్రయాణంపై ఆసక్తి నెలకొంది.

నవంబర్ 1న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్​ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్​ రాజ్​కుమార్​కు కర్ణాటక అత్యున్నత పురస్కారం 'కర్ణాటక రత్న' అవార్డు ఇవ్వనున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం తారక్​ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి రావడానికి తారక్​ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్​ను సైతం ఆహ్వానించామని చెప్పారు. కన్నడ ప్రజల్లో పునీత్​కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని బొమ్మై తెలిపారు.

ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్​ కుమార్ కుంటుంబంతోపాటు జ్ఞనపీఠ్​ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్​ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పునీత్​ రాజ్​కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూశారు. ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా ఆయన నిలవనున్నారు పునీత్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.