ETV Bharat / entertainment

'కాంతార చాప్టర్ 1' టీజర్ ఔట్ - ప్రీక్వెల్​తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 12:32 PM IST

Updated : Nov 27, 2023, 1:59 PM IST

Kantara Chapter 1 Teaser : బ్లాక్​బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్​గా తెరకెక్కుతోంది కాంతార చాప్టర్ -1. ఈ సినిమా టీజర్​ను మూవీటీమ్ సోమవారం విడుదల చేసింది. మీరు టీజర్ చూశారా?

Kantara chapter 1 teaser
Kantara chapter 1 teaser

Kantara Chapter 1 Teaser : రిషభ్​ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కాంతార చాప్టర్ -1'. ఇది గతేడాది రిలీజై బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచిన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్​గా రూపొందుతోంది. 'కాంతార' తొలి పార్ట్​ సినిమాలో చూసిన కథకు ముందు ఏం జరిగింది? అనేది ఈ 'కాంతార చాప్టర్ 1'లో చూపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇక ముందుగా ప్రకటించిన విధంగానే.. సోమవారం (నవంబర్ 27)న సినిమా టీజర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. మరి మీరు ఈ టీజర్ చూశారా?

అయితే కాంతార తొలి భాగాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు. స్టోరీ అంతా అటవీ ప్రాంతం బ్యాక్​డ్రాప్​లో తీయడం వల్ల పెద్దగా ఖర్చు కాలేదు. కానీ, కాంతార ప్రీక్వెల్ మాత్రం భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ 4వ సెంచరీలోదని, హీరో రిషభ్ శెట్టి కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇన్​సైడ్ టాక్. ఇక మూవీకి హైప్​ క్రియేట్ అయ్యేలా.. విఎఫ్ఎక్స్​కు డిజైన్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే బడ్జెట్​ రేంజ్​ పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ను నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని మూవీ టీమ్ ప్లాన్​ చేస్తోందట. మొదటి పార్ట్​ షూటింగ్‌ను ఎక్కువ శాతం ఆయన సొంత ఊరు కుందాపురలో చేయగా.. ఇప్పుడు రెండో భాగాన్ని బెంగుళూర్‌లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఇటీవల ప్రారంభమైన సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ముగించేలా ప్లాన్ చేశారట. ఇక 2024 చివర్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేయనున్నారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kantara Movie Boxoffice Collection : కాంతార తొలి భాగం అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం అందుకుంది. ప్రకృతి - మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేసేలా సినిమాను తెరకెక్కించి, తొలుత కన్నడలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయా భాషల్లోకి డబ్బింగై.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్​గా ప్రపంచవ్యాప్తంగా కాంతార రూ. 400 కోట్లపైగానే కలెక్షన్లు వసూల్ చేసింది.

Kantara 2 update : 'కాంతార-2' కోసం అది నేర్చుకుంటున్న​ డైరెక్టర్ ​రిషభ్​ శెట్టి!

Kantara Part 2 Story : 'కాంతార' ప్రీక్వెల్​ కోసం ఏకంగా ఆ శతాబ్దంలోకి.. కళ్లు చెదిరే రేంజ్​లో బడ్జెట్​!

Last Updated :Nov 27, 2023, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.