ETV Bharat / entertainment

ప్రముఖ నటుడిపై దుండగుల కాల్పులు

author img

By

Published : Jul 13, 2022, 3:28 PM IST

కన్నడ చిత్ర సీమలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రముఖ నటుడు శివరంజన్ బొలన్నవర్‌‌పై దుండగులు కాల్పులు జరిపారు. అసలేమైంది? దాడి చేసింది ఎవరు?

Kannada actor Shivaranjan shot at, escapes unhurt
ప్రముఖ నటుడుపై దుండగుల కాల్పులు

ప్రముఖ కన్నడ నటుడు శివరంజన్ బొలన్నవర్‌‌పై దుండగులు కాల్పులు జరపడం.. సంచలనంగా మారింది. బైల్​హొంగళ్‌లోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఈ కాల్పుల్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

శివరంజన్ బొలన్నవర్‌‌.. బైల్‌హోంగళ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులను చూసేందుకు మంగళవారం రాత్రి వెళ్లారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు తలుపు కొడుతున్న సమయంలో.. మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల్లో శివరంజన్​కు ఎలాంటి గాయాలు కాలేదు. మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. శివరంజన్‌ను లక్ష్యంగా చేసుకుని అగంతకులు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరభద్ర, బిసి రక్త, ఆట హుడుగాట, అమృత సింధు.. తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

shivaranjan
శివరంజన్

ఇదీ చదవండి: కేఎల్​ రాహుల్​తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.