ETV Bharat / entertainment

Jailer Day 4 Collection : రజనీ 'జైలర్' కలెక్షన్ల సునామీ.. రూ.150 కోట్లకు చేరువలో..

author img

By

Published : Aug 14, 2023, 11:13 AM IST

Updated : Aug 14, 2023, 12:36 PM IST

Jailer Day 4 Collection : సూపర్​ స్టార్​ రజినీకాంత్ 'జైలర్'​ సినిమా బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు నుంచే మంచి స్పందన అందుకున్న ఈ సినిమా.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. తాజాగా నాలుగో రోజు ఎంత వసూల్ చేసిందంటే.

Jailer Day 4 Collection
రజనీ జైలర్ కలెక్షన్ల సునామీ

Jailer Day 4 Collection : సూపర్​ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా మూడో రోజే వంద కోట్ల క్లబ్​లో చేరగా.. తాజాగా నాలుగో రోజు దాదాపు రూ. 38 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా మొత్తం కలెక్షన్లు ఎంతంటే..

సూపర్ హిట్ టాక్​తో దూసుకుపోతున్న జైలర్ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 146 కోట్లు వసూల్ చేసి.. ప్రస్తుతం​ రూ. 150 కోట్లకు చేరువలో ఉంది. మరోవైపు నాలుగు రోజుల నుంచి కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి.

జైలర్ సినిమా రోజువారీ కలెక్షన్లు...

  • మొదటి రోజు రూ. 48.35 కోట్లు
  • రెండో రోజు రూ. 25.75 కోట్లు
  • మూడో రోజు రూ. 35 కోట్లు
  • నాలుగో రోజు రూ. 38 కోట్లు.

కాగా జైలర్​తో రజనీ చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. ఇదివరకు ఆయన నటించిన కబాలి, పేట, కాల సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచాయి. తాజాగా జైలర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం వల్ల.. థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇన్ని రోజులకు రజనీ రేంజ్​కు తగ్గ బొమ్మ పడిందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా రానున్న రెండు రోజులు కలెక్షన్ల సునామీ కురవడం పక్కా అని సినీవర్గాల టాక్.

జైలర్ విషయానికొస్తే... డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్​ స్టార్ ఫ్యాన్స్​ను మెప్పించడంలో విజయవంతమయ్యారు. సినిమాలో యాక్షన్​, సెంటిమెంట్​, కామెడీ ఇలా అన్ని అంశాలను నెల్సన్ చక్కగా తెరకెక్కించారు. ఇక మూవీలో తండ్రీ - కుమారుల సెంటిమెంట్​కు ఆడియెన్స్ పూర్తిగా కనెక్ట్​ అయ్యారు. సూపర్​స్టార్ రజనీకాంత్​ సరసన సీనియర్ నటి రమ్యకృష్ణను చూసి.. ఫ్యాన్స్​ పాత రోజులు గుర్తుచేసుకున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఓ స్పెషల్ సాంగ్​తో మెరిశారు.

మలయాళ సీనియర్ నటుడు మోహన్​లాల్​, కన్నడ స్టార్ శివ రాజ్​కుమార్ కీలక పాత్రల్లో నటించారు. యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​ రవిచందర్​ అందించిన మ్యూజిక్​.. ఈ సినిమాకు మరో హైలైట్​గా నిలిచింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్ధ సన్​ పిక్చర్స్​ ఈ సినిమాకు రూపొందించింది.

Jailer Day 3 Collection : మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్​.. థియేటర్లలో 'జైలర్​' బొమ్మ బ్లాక్​బస్టర్​..

Jailer and Bhola shankar : చిరుకు షాక్​.. ఇకపై 'భోళాశంకర్'​ థియేటర్లలో రజనీ 'జైలర్​'!

Last Updated : Aug 14, 2023, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.