ETV Bharat / entertainment

ఆస్కార్​ చిత్రం 'ఛెల్లో షో' కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే..

author img

By

Published : Oct 15, 2022, 11:07 PM IST

ఈసారి భారత్ నుంచి ఆస్కార్​కు ఎంపికైన సినిమా 'ఛెల్లో షో'. పెద్ద పెద్ద సినిమాల్నిపక్కకు నెట్టేసి ఆస్కార్​ బరిలో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్య్వూలో పంచుకున్నారు సినిమా దర్శకుడు పాన్​ నలిన్.

last film show movie oscar nominate
last film show movie oscar nominate

'ఛెల్లో షో'.. ఈసారి భారత్​ నుంచి ఆస్కార్​కు ఎంపికైన సినిమా. అనూహ్యంగా పెద్ద పెద్ద చిత్రాలను పక్కన పెట్టి.. ఈ సినిమా ఆస్కార్​ రేస్​లో దూసుకెళ్లింది. చెల్లో షో గుజరాత్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అయితే గుజరాత్​నుంచి ఆస్కార్​కు ఎంపికైన రెండో చిత్రంగా చెల్లో షో నిలించింది. ఈ సినిమా గురించి తన అనుభవాలు 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు దర్శకుడు పాన్​ నలిన్. అతడు ఏం చెప్పారో తెలుసుకుందాం..

ఈ సినిమా కథ ఏంటి?
"ఆఖ్రీ ఫిల్మ్ షో" కథనే మీ ప్రశ్నకు సమాధానం. "ఆఖ్రీ ఫిల్మ్ షో" (లాస్ట్​ ఫిల్మ్​ షో).. ఇది ఒక బాలుడి కథ. ఈ బాలుడు మొదటిసారి మహంకాళి సినిమా చూడ్డానికి వెళ్తాడు. దీంతో ఆ సినిమాపై విపరీతమైన ఇష్టం పెంచుకుంటాడు. ఎందుకంటే ఆ బాలుడు తన జీవితంలో ఇంతవరకు ఏ సినిమా చూడలేదు. ఆ తర్వాత చదువు మానేసి సినిమాలపై మక్కువ పెంచుకుంటాడు. మొదటగా అతడు ఓ సినిమా తీయాలని అనుకుంటాడు. దాని కోసం ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఒక ప్రొజెక్టర్​ ఆపరేటర్​ను కలుసుకుంటాడు. దీంతో వారు మంచి స్నేహితులు అవుతారు. ఆ తర్వాత నుంచి బాలుడు ఉచితంగా సినిమా చూడటానికి ఆపరేటర్​ అనుమతిస్తాడు. దీంతో వారి స్నేహం మరింత బలపడుతుంది. అయితే వారి జీవితాల్లో పెను మార్పులు వస్తాయని కొద్దిగా వారికి తెలుసు. ఇది సినిమా కథ.

ఈ సినిమా చేయాలనే ఐడియా మీకు ఎక్కడినుంచి వచ్చింది? ఈ సినిమాలో ఉన్న బాలనటుడు ఎవరు?
ఈ సినిమాకు మూలం నా చిన్నతనంలో ఉంది. నాకు కూడా ఒక ప్రొజెక్టర్​ ఆపరేటర్ ఫ్రెండ్​ ఉండేవాడు. అయితే 2010-11 ప్రాంతంలో.. అన్నీ డిజిటల్​ అయిపోవడం వల్ల ప్రొజెక్ట్​ ఆపరేటర్లకు పని పూర్తిగా పోయింది. దీంతో ప్రొజెక్టర్లు అన్ని పనికి రాకుండా పోయాయి. దీని కారణంగా సినిమాలన్నీ సింగిల్​ స్క్రీన్, డబుల్ స్క్రీన్లలో వచ్చేవి. అయితే ఈ సినిమాలో పిల్లలు ఉండటం కూడా ముఖ్యమే. దానికోసం 3 వేల మంది పిల్లల్ని ఆడిషన్ చేశాం. అందులోనుంచి ఆరుగురిని సెలెక్ట్​ చేశాం. అందులో అహ్మదాబాద్​ నుంచి భవిన్ రబారి ఒకరు.

ఈ సినిమాకు లాస్ట్​ ఫిల్మ్​ షో అని ఎందుకు పేరు పెట్టారు?
సింగిల్ షో క్లోజ్ అవుతున్నాయి. మరోవైపు డిజిటల్ షోలు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాలో 'లాస్ట్ ఫిల్మ్​ షో' చూడాలనే తన కలలను నెరవేర్చుకోవడానికి పల్లెటూరిని వదిలి పెద్ద నగరానికి వస్తాడు అన్న కోణంలో ఈ చిత్రానికి 'లాస్ట్ ఫిల్మ్ షో' అనే పేరు పెట్టాను.

ఏయే భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది?
ఇప్పటి వరకు స్పానిష్, జర్మనీ లో డబ్​ చేశాము. ఈ సినిమా అమెరికా, జపాన్, ఇటలీలో కూడా విడుదల అయ్యింది. భారత్​లో మాత్రం కేవలం గుజరాతీలోనే రిలీజ్ అయ్యింది. అయితే దీన్ని హిందీ, ఇంకా కావాలంటే దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేస్తాం.
ఈ సినిమాలో చాలా మంది బాల నటులు ఉన్నారు. అనుభవం లేని కారణంగా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నటనలో అనుభవం లేని వాల్ల వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. కానీ చాలా సమయం ఉంది. దీంతో పిల్లలు బాగా కష్ట పడ్డారు. వారి కోసం షూటింగ్​లో సమయంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేశాం. కొన్ని సన్నివేశాల్లో వారు ఆడుకున్నట్టు చేశారు.

'లాస్ట్ ఫిల్మ్ షో' షూటింగ్ గుజరాత్ కాకుండా ఏ రాష్ట్రంలో జరిగింది?
'లాస్ట్ ఫిల్మ్ షో మూవీ' షూటింగ్ ఎక్కువ భాగం నేను పెరిగిన సౌరాష్ట్ర ప్రాంతంలోనే జరిగింది. సరిహద్దు గ్రామాలైన అమ్రేలి, లాఠీ, చలాలా, ధారి, ససంగీర్‌లో షూటింగ్‌ జరిగింది. క్లైమాక్స్‌ను రాజ్‌కోట్‌లో చిత్రీకరించాము.

ఈ చిత్ర బాలనటుడు రాహుల్ కోలీ ఇటీవల మరణించారు. అయితే అతడి నటన ఎలా ఉంది?
బాల నటుడు రాహుల్ కోలీ ప్రధాన నటుడి స్నేహితులలో ఒకరిగా నటించాడు. ఎప్పుడు షూటింగ్‌కి వచ్చినా ఆసక్తి చూపేవాడు. అతడు చాలా బాగా నటించాడు. తాను పెద్దయ్యాక ముంబయికి తీసుకెళ్లి లైట్​ మ్యాన్​ని చేస్తాం అని చెప్పాం. ఎందుకంటే అతడు ఇప్పుడు చదువుకుంటున్నాడు. షూటింగ్ ఉన్నప్పుడల్లా లైట్​ మ్యాన్​కు సహకరిస్తాడు.
2-3 నెలల క్రితం అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని మాకు తెలిసింది. ఆ సమయంలో అతడిని అహ్మదాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పుడు ఈ సినిమా యూనిట్​ మొత్తం ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్‌తో కూడా నిరంతరం టచ్‌లో ఉండేవాడు. అతడిని కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశాం. కానీ అది మా చేతుల్లో లేని వ్యాధి. ఈరోజు ఆతడిని చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు మా సినిమా ఆస్కార్‌కి వెళ్తోందని ఓ కంటితో నవ్వుకుంటున్నాం. రాహుల్ కోలీ మరణంతో మరో కన్ను నుంచి కన్నీరు కారుతోంది. రాహుల్ బతికుంటే.. ఈరోజు ఫంక్షన్ అయ్యాక కలవాలనుకున్నాను.
ఇవీ చదవండి: ప్రముఖ నిర్మాత కన్నుమూత... శోకసంద్రంలో సినీ ప్రపంచం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.