ETV Bharat / entertainment

IIFA awards: ఐఫా విజేతలు వీరే.. ఉత్తమ నటులుగా విక్కీ, కృతి

author img

By

Published : Jun 5, 2022, 2:26 PM IST

IIFA awards 2022
ఐఫా అవార్డ్స్​ 2022

IIFa awards 2022: దుబాయ్‌ వేదికగా 'ది ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ అవార్డ్స్‌' (ఐఫా) కార్యక్రమం ఎంతో గ్రాండ్​గా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు తారలు, దర్శకులు అవార్డులు అందుకున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏఏ పురస్కారాలు అందుకున్నారో తెలుసుకుందాం..

IIFA awards 2022: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో 'ది ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ అవార్డ్స్‌' (ఐఫా) ఎంతో ప్రతిష్టాత్మకమైనది. పురస్కారాలు అందుకోవడమే కాకుండా.. తారలందరూ ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేసే కార్యక్రమం ఇది. ఈ సారి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జూన్‌ 3, 4 తేదీల్లో దుబాయ్‌లో జరిగిన ఈ వేడుకల్లో రెహమాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌, విక్కీ కౌశల్‌, అనన్యపాండే, నోరా ఫతేహి, జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్‌, ఉత్తమ నటిగా కృతిసనన్‌ అవార్డులు గెలుపొందారు. మరి, ఈ వేడుకల్లో ఎవరెవరు అవార్డులు సొంతం చేసుకున్నారంటే..

  • ఉత్తమ చిత్రం: షేర్షా
    ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్‌ (షేర్షా)
    ఉత్తమ నటుడు: విక్కీ కౌశల్‌ (సర్దార్‌ ఉద్దమ్‌)
    ఉత్తమ నటి: కృతిసనన్‌ (మిమీ)
    ఉత్తమ సహాయనటుడు: పంకజ్‌ త్రిపాఠి (లూడో)
    ఉత్తమ సహాయనటి: సాయి తమ్హాంకర్‌ (మిమీ)
    ఉత్తమ నూతన నటుడు: అహాన్‌శెట్టి (తడప్‌)
    ఉత్తమ నూతన నటి: శార్వరి వాఘ్ (బంటీ ఔర్‌ బబ్లీ 2)
    ఉత్తమ గాయకుడు: జుబిన్ నౌటియల్, రతన్ లంబియన్ (షేర్షా)
    ఉత్తమ గాయని: అసీస్ కౌర్ (షేర్షా)
    ఉత్తమ సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌ (ఆత్రంగి రే), తనిష్క్ బాగ్చి,జస్లీన్ రాయల్ (షేర్షా)
    ఉత్తమ లిరిక్స్‌: కౌసర్ మునీర్ (83)
    ఉత్తమ ఒరిజినల్‌ స్టోరీ: అనురాగ్‌ బసు (లూడో)
    ఉత్తమ అడాప్టెడ్‌ స్టోరీ: కబీర్‌ ఖాన్‌, సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ (83)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.