ETV Bharat / entertainment

'హనుమాన్​ 2'పై అంచనాలు పెంచేసిన బాలయ్య! - ఈ వీడియో చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 3:06 PM IST

Hanuman Movie Balakrishna : హనుమాన్​ సినిమాను వీక్షించిన నటసింహం బాలయ్య హనుమాన్ 2 గురించి మాట్లాడారు. హనుమాన్ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దానికి సంబంధించిన వీడియో మీకోసం.

'హనుమాన్​ 2'పై అంచనాలు పెంచేసిన బాలయ్య - ఈ వీడియో చూశారా?
'హనుమాన్​ 2'పై అంచనాలు పెంచేసిన బాలయ్య - ఈ వీడియో చూశారా?

Hanuman Movie Balakrishna : సంక్రాంతి సినిమాల్లో 'హ‌నుమాన్' బ్లాక్‌ బ‌స్ట‌ర్​గా నిలిచిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల్లో వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నార్త్​లోనూ మంచి రెస్పాన్స్​ను అందుకుంటోంది. ఈ సినిమా జోరు చూస్తుంటే రెండు వంద‌ల కోట్ల మార్క్​ను అందుకుంటుందని ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ అగ్రనటులు సినిమాను అభినందిస్తున్నారు.

అయితే హ‌నుమాన్ చిత్రాన్ని మంగ‌ళ‌వారం(జనవరి 16) బాల‌కృష్ణ ప్ర‌త్యేకంగా వీక్షించిన సంగతి తెలిసిందే. హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో బాల‌య్య కోసం హ‌నుమాన్ స్పెష‌ల్ స్క్రీనింగ్‌ వేశారు. ఈ షోకు బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హీరో తేజా స‌జ్జాతో పాటు మరికొంతమంది హాజ‌ర‌య్యారు.

అయితే సినిమా చూశాక బాలయ్య ఏం అన్నారో వీడియో తీసి మైత్రీ మూవీ మేకర్స్​ ట్విటర్​లో షేర్ చేసింది. సినిమాలో చాలా కంటెంట్​ ఉందని, చాలా బాగుంద‌ని బాలయ్య ప్రశంసలు కురిపించారు. ఫొటోగ్ర‌ఫీ, వీఎఫ్ఎక్స్‌, మ్యూజిక్ బాగుంది, ఆర్టిస్టులంద‌రూ బాగా న‌టించార‌ు, ప్రశాంత్ వర్మ డైరెక్షన్​ అంతా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాగా, త్వ‌ర‌లోనే తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి హ‌నుమాన్ స‌క్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు సమాచారం అందింది. ఈ స‌క్సెస్ మీట్‌కు కూడా బాల‌కృష్ణ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. ఇకపోతే బాల‌కృష్ణ‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ(Balakrishna Prasanth Varma Cinema) ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వస్తున్నాయి. బాల‌కృష్ణ‌కు ఓ క‌థ చెప్పిన‌ట్లు హ‌నుమాన్ ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ మధ్యే చెప్పారు.

హ‌నుమాన్ చిత్రాన్ని అంజ‌నాద్రి అనే ఫిక్ష‌న‌ల్ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించారు. చిత్రంలో అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీలక పాత్ర పోషించగా కోలీవుడ్ న‌టుడు విన‌య్ రాయ్ విల‌న్‌గా క‌నిపించారు. ఇక ఈ హ‌నుమాన్‌కు జై హ‌నుమాన్ పేరుతో సీక్వెల్ త్వరలోనే రానుంది.

రూ.100 కోట్లు దాటేసిన 'హనుమాన్' - అక్కడ 'సలార్​', 'బాహుబలి' రికార్డ్స్​ బ్రేక్​

IMDBలో అతి తక్కువ రేటింగ్ ఉన్న మూవీ ఏదో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.