ETV Bharat / entertainment

పిల్లి కళ్ల భామకు పెళ్లి కళ.. చారిత్రక కోటలో వివాహం.. వరుడు ఎవరంటే?

author img

By

Published : Oct 17, 2022, 2:30 PM IST

దేశముదురుతో కుర్రకారు మనసుల్ని దోచేసిన హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఇప్పుడు ఈ పిల్లి కళ్ల భామ పెళ్లి పీటలెక్కబోతోంది. రాజస్థాన్​లోని 450 ఏళ్ల చరిత్ర కలిగిన కోటలో వివాహం జరగనుంది. ఈ మేరకు ఆ రాజకోట ముస్తాబు అవుతున్నట్టు సమాచారం.

Hansika Motwani marriage
Hansika Motwani marriage

టీవీ సీరియళ్లలో బాలనటిగా ప్రయాణం మొదటి పెట్టి.. హీరోయిన్​గా​ దూసుకుపోతోంది హన్సిక మోత్వానీ. ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత కొంత కాలంగా హన్సిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమేని.. ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్​లో జైపూర్ కోటలో వివాహం చేసుకుంటున్నట్లు తెలిపింది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయినట్లు వెల్లడించింది. అయితే, పెళ్లి కొడుకు ఎవరనేది బయటకు వెల్లడించలేదు.

హన్సిక వివాహానికి రాజస్థాన్‌ జైపూర్‌లోని 450 ఏళ్ల చరిత్ర కలిగిన 'ముందోతా ఫోర్ట్​ ప్యాలెస్​' వేదిక కానుంది. రాయల్ వెడ్డింగ్​లా ఈ పెళ్లి జరగనుంది. కొంచెం వింటేజ్​ టచ్​ కూడా ఉండబోతున్నట్టు సమాచారం. దీనికోసం ఈ హోటల్‌లోని అన్ని గదులు, సూట్లను ఇప్పటికే బుక్‌ చేసినట్టు సమాచారం.

టీవీ సీరియళ్లలో చైల్డ్​ ఆర్టిస్ట్​గా నటన ఆరంభించింది హన్సిక. 'షక లక భూం భూం', 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ','సన్ పారి' వంటి సీరియళ్లలో నటించింది. వీటితో పాటు హృతిక్ రోషన్​ నటించిన 'కోయ్​ మిల్​ గయా'లో కూడా మెరిసింది ఈ ముద్దు గుమ్మ. హన్సిక నటించిన 50వ చిత్రం ఈ ఏడాది మొదట్లో విడుదలైంది. త్వరలో ఈమె నటించిన తమిళ సినిమా 'రౌడీ బేబీ' విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇవీ చదవండి : నయన్​, విఘ్నేశ్​కు ఆరేళ్ల క్రితమే పెళ్లి!.. సరోగసి వివాదంలో కొత్త ట్విస్ట్!!

కుర్రకారు మనసు దోచేస్తున్న పాలబుగ్గల భామ, దసరాతో దుమ్మురేపేందుకు రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.