ETV Bharat / entertainment

'గుంటూరు కారం' సాంగ్ లీక్​ - పాపం తమన్​కే ఎందుకిలా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 11:53 AM IST

Updated : Nov 4, 2023, 12:38 PM IST

Gunturu Kaaram First Single Leaked : 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ ఆడియో క్లిప్​ లీక్ అయి నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. దీనికి తమన్ బీట్ అందించారు. అయితే ఈ మధ్య కాలంలో తమన్ కంపోజ్​ చేసిన సాంగ్సే వరసగా లీక్​ అవ్వడం గమనార్హం.

'గుంటూరు కారం' సాంగ్ లీక్​.. పాపం తమన్​కే ఎందుకిలా?
'గుంటూరు కారం' సాంగ్ లీక్​.. పాపం తమన్​కే ఎందుకిలా?

Gunturu Kaaram First Single Leaked : లీక్​ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అస్సలు ఆగట్లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఇదీ అడ్డంకిగా మారింది. ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ కన్నా ముందే లీకేజీ రాయుళ్ల చేతికి చిక్కి.. సోషల్​ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. టాలీవుడ్​లో ఇప్పుడీ సమస్యను సంగీత దర్శకుడు తమన్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు!

ఈ మధ్య కాలంలో గమనిస్తే.. తమన్ కంపోజ్​ చేసిన​ సాంగ్సే ఎక్కువగా విడుదలకు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. ఆ మధ్య రామ్​ చరణ్​ గేమ్​ ఛేంజర్​ ఫస్ట్​ సింగిల్​ 'జరగండి జరగండి' సోషల్ మీడియాలో ప్రత్యేక్షమై అభిమానులతో పాటు మూవీటీమ్​కు బిగ్​ షాక్​ ఇచ్చింది. దీంతో నిర్మాత దిల్​ రాజ్​ టీమ్ లీగల్ యాక్షన్​ తీసుకుంటున్నాం అని చెప్పి.. సాంగ్​ అఫీషియల్ రిలీజ్​కు ప్లాన్ చేశారు.

ఇది జరిగి కొద్ది రోజులు కూడా కాలేదు.. అంతలోనే ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమా విషయంలోనూ మళ్లీ ఇదే సమస్య రిపీట్ అయింది. నిజానికి ఓ సాంగ్​ కోసం ఏ హీరో అభిమానులు కూడా వెయిట్ చేయని రేంజ్​లో 'గుంటూరు కారం' పాట కోసం మహేశ్ అభిమానులు ఎదురు చూశారు. దీంతో అదుగో ఇదిగో అంటూ వచ్చిన మూవీటీమ్​.. అన్ని నెలల నిరీక్షణకు తెరదించుకూ రీసెంట్​గానే ఫస్ట్ సింగిల్​ రిలీజ్​కు ప్లాన్ రెడీ చేసింది. కానీ ఇప్పుడు మేకర్స్​కు బిగ్​ షాక్ తగిలింది. తమన్ కంపోజ్​ చేసిన పాటకు సంబంధించి ఓ అడియో క్లిప్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' అంటూ మొదలైన సాంగ్​లో.. బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు ఉన్నాయి. అయితే ఇది జస్ట్​ ట్రాక్ బీట్ మాత్రమేనట. ఫుల్​ క్వాలిటీ వెర్షన్ సాంగ్​ కాదని అంటున్నారు. వాస్తవానికి రామ్​ చరణ్​ గేమ్​ ఛేంజర్ సాంగ్​​ లీక్​ అవ్వగానే తమన్​ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ గుంటూరు కారం విషయంలో లీక్ ఆపలేకపోయారు. గతంలోనూ మహేశ్​ సర్కారు వారి పాట చిత్రంలోని తమన్ కంపోజ్ చేసిన కళావతి సాంగ్ లీకేజ్ రాయుళ్ల చేతికి చిక్కింది. అలా వరుసగా తమన్ సాంగ్సే ఎక్కువగా లీక్ అవుతున్నాయి.

టైట్​ ఫిట్​లో ఇలా బంధిస్తే.. అందాలకు ఊపిరాడేదెలా జాన్వీ?

మా ఊరి పొలిమేర 2 కామాక్షి - డాక్టర్ - యాక్టర్ - త్వరలోనే డైరెక్టర్​ - యమా హాట్ గురూ

Last Updated : Nov 4, 2023, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.