ETV Bharat / entertainment

గుంటూరు కారం : శ్రీలీల స్వీటు - నువ్వే నా హార్టు - బ్యానర్లతో ఫ్యాన్స్ హంగామా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 12:06 PM IST

Guntur Kaaram Sreeleela Banner : సాధారణంగా సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ దగ్గర హంగామ, హీరోల బ్యానర్లు, కటౌట్స్ ఉంటాయి. హీరోయిన్ల బ్యానర్లు కట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే తాజాగా గుంటూరు కారం విడుదల సందర్భంగా శ్రీలీల కోసం బ్యానర్లు వేశారు ఫ్యాన్స్​. అయితే ఓ వీరాభిమాని కట్టిన బ్యానర్​, అందులో రాసిన కొటేషన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మీరు చూశారా?

Guntur Kaaram Sreeleela Banner
గుంటూరు కారం : శ్రీలీల స్వీటు - నువ్వే నా హార్టు - బ్యానర్లతో ఫ్యాన్స్ హంగామా!

Guntur Kaaram Sreeleela Banner : స్టార్​ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా మాములుగా ఉండదు. తమ అభిమాన హీరోల భారీ ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలతో ఈలలు వేస్తూ గోల గోల చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఎక్కువగా హీరోల బ్యానర్లే పెట్టడమే చూస్తుంటాం. హీరోయిన్ల బ్యానర్లు కట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

తాజాగా యంగ్​ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు బ్యానర్లు కట్టేశారు అభిమానులు. గుంటూరు కారం విడుదల సందర్భంగా శ్రీలీల కోసం ఓ అభిమాని కట్టిన బ్యానర్​ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే దానిపై అదిరిపోయే కొటేషన్లు కూడా రాశారు. గుంటూరు కారం ఘాటు - మూవీకి హీరోయిన్ శ్రీలీల స్వీటు - అందుకే నువ్వే నా హార్టు అంటూ స్పెషల్ కొటేషన్లు రాశారు. దాని కింద శ్రీలీల డైహార్ట్ ఫ్యాన్స్ అంటూ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యానర్​కు సంబంధించిన ఫొటో నెట్టింట్లో తెగ వైరల్​ అవుతోంది.

ఇకపోతే గతంలో అరుంధ‌తి, భాగ‌మ‌తి వంటి లేడీ ఓరియెంటెడ్​ ప్ర‌ధాన‌ చిత్రాల‌తో అల‌రించిన అనుష్క‌కు, ఆ తర్వాత నయనతార, సమంతకు మాత్రమే బ్యాన‌ర్లు క‌ట్టారు. కానీ ఇప్పుడు వీళ్ల‌కు దీటుగా శ్రీలీల‌కు కూడా బ్యాన‌ర్లు క‌ట్టి ఆరాధించేస్తున్నారు. కన్నడ నుంచి ఓ తెలుగ‌మ్మాయికి ఇంత పెద్ద స్థాయిలో గౌర‌వం ద‌క్క‌డం విశేషం. శ్రీ‌లీల కన్నా ముందే చాలా మంది తెలుగ‌మ్మాయిలు హీరోయిన్లుగా మారినా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నారు. కానీ కెరీర్ ప్రారంభంలోనే శ్రీలీల ఇంత పెద్ద స్టార్ డ‌మ్ రావడం విశేషమనే చెప్పాలి.

గుంటూరు కారం సినిమా విషయానికొస్తే మూవీ మిక్స్​డ్​ టాక్​ను సొంతం చేసుకుంది. కొంతమంది దర్శకుడు త్రివిక్రమ్​, నిర్మాత నాగవంశీపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాలో మహేశ్​ బాబుతో పాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి కథనాయికగా నటించగా - ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, బ్రహ్మానందం, రమ్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్​తో సినిమాను నిర్మించినట్లు తెలిసింది.

'గుంటూరు కారం' ఓపెనింగ్స్​ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్​ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.