ETV Bharat / entertainment

'గుంటూరు కారం' ఓపెనింగ్స్​ - ఆల్​ టైమ్​ రికార్డ్​ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 10:58 AM IST

Updated : Jan 13, 2024, 2:58 PM IST

Mahesh Babu Guntur Kaaram Day 1 Collections WorldWide : 'గుంటూరు కారం' చిత్రం మిశ్రమ స్పందనలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్​ వివరాలు ఎలా ఉన్నాయంటే?

'గుంటూరు కారం' ఓపెనింగ్స్​ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
'గుంటూరు కారం' ఓపెనింగ్స్​ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Mahesh Babu Guntur Kaaram Day 1 Collections WorldWide : సూపర్ స్టార్​​ మహేశ్ బాబు 'గుంటూరు కారం' జనవరి 12న భారీ స్థాయిలో రిలీజైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా రికార్డ్​ స్థాయిలో ఓపెనింగ్స్​ను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 94 కోట్లు వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్​ చేసింది. ఆల్​ టైమ్ రికార్డ్​ అని ట్వీట్ చేసింది. ఓ రీజనల్ సినిమాకు ఇంతటి స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి.

హైదరాబాద్‌లో భారీగా షోలు - 'గుంటూరు కారం' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అలా ఒక్క హైదరాబాద్​ నగరంలోనే ఈ చిత్రం వెయ్యికి పైగా షోలు ప్రదర్శితం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన కొద్ది చిత్రాల్లో స్థానం సాధించింది.

క్రాస్ రోడ్స్‌లో - నైజాం ఏరియాలో గుంటూరు కారం సినిమా రూ. 16.9 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఇక ఈ ఏరియాలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ చిత్రానికి మొదటి రోజే భారీ స్థాయిలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రూ. 81.61 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ క్రమంలోనే 'RRR' రూ. 75.85 లక్షల రికార్డును ఇది బ్రేక్ చేసింది.

Guntur Kaaram Cast and Crew : ఇకపోతే గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్​ మహేశ్​ బాబుకు జంటగా టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల, హిట్ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటులు ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు రూ. 200 కోట్ల రూపాయలతో ఈ సినిమా నిర్మించినట్లు తెలుస్తోంది.

  • Biggest opening day ever for the Reigning Super 🌟 @urstrulyMahesh 🕺😎#GunturKaaram strikes a 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝟗𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Worldwide on Day 1 ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 in regional cinema! 🔥🔥

    Watch the #BlockbusterGunturKaaram at cinemas near you… pic.twitter.com/TNNMBjVLeI

    — Haarika & Hassine Creations (@haarikahassine) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'గుంటూరు కారం', 'హనుమాన్' జోష్- దెబ్బకు థియేటర్లు ఫుల్

రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్​ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?

Last Updated : Jan 13, 2024, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.